
బాలీవుడ్లో నవ్వుల రారాజు, రిచెస్ట్ కమెడియన్‌గా పేరుగాంచిన కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఇటీవల నెట్ఫ్లిక్స్లోని దిగ్రేట్ ఇండియన్ కపిల్ షోలో స్లిమ్గా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఒక్కసారిగా అతడి ఆకృతి చాలా స్మార్ట్గా మారిపోయింది. ఇంతకీ కపిల్ అంతలా బరువు ఎలా తగ్గాడు? హెల్ప్ అయ్యిన ట్రిక్ ఏంటి.. వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.
భారతీయ బ్రేక్ఫాస్ట్లలో ముఖ్యంగా బ్రెడ్ విత్ నెయ్యి, టీ సమెసా లేదా పరాఠా తప్పనిసరిగా ఉంటాయని అంటున్నారు కపిల్ శర్మ. బయటకు వెళ్లినా..ముందుగా అవే ఆర్డర్ చేస్తారని అన్నారు. ఇలాంటి ఆహార పదార్థాలే అధిక బరువుకి ప్రధాన కారణమని అన్నారు. మనం ఏంతింటున్నాం అనే దానిపై మనకు అవగాహన, నియంత్రణ ఉండటం అత్యంత ముఖ్యమని చెప్పారు.
ఇటీవల ఆయనే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానెల్లో తన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడారు. అందరూ ఫిట్నెస్పై దృష్టిపెట్టాలని, బరువుని అదుపులో ఉంచుకోవాలంటూ ఆరోగ్య స్ప్రుహ కలిగించే యత్నం చేశారు. అలాగే మన శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల మనలో మంచి మార్పులు వేగవంతంగా వస్తాయన్నారు. దీంతోపాటు మంచి జీవనశైలి అలవరచుకోవాలని సూచించారు. తాను ఫరా ఖాన్, సోను సూద్ వంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చిన ఫిట్‌నెస్ కోచ్ యోగేష్ భటేజా పర్యవేక్షణలో తన వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించినట్లు తెలిపారు.
అయితే చాలామంది బరువు తగ్గాలంటే అధిక వ్యాయమాలు చేయాలేమోనని అపోహ పడుతుంటారని అన్నారు. కానీ అందులో వాస్తవం లేదని చెప్పారు కపిల్. తన దినచర్యకు అనుగుణంగా బరువుని తగ్గించే స్ట్రెచ్చింగ్ వంటి వ్యాయామాలను చేయాలని, అవి కూడా పరిమితంగానే అని చెప్పారు. నిజానికి వ్యాయామాలు శరీరంలో కండరాల సామర్థ్యాన్ని పెంపొందించి కదలికలకు ప్రోత్సహించడమే గాక బాడీ కూడా తేలిగ్గా ఉంటుందని అన్నారు.
తన ట్రైనర్ బరువు తగ్గేలా 21-21-21 రూల్ని సూచించినట్టు తెలిపారు. దీనివల్లే తాను రెండు నెల్లలో సుమారు 11 కిలోలు తగ్గి మంచి మార్పులు వచ్చాయని అన్నారు. ఇది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ రూల్ అని చెప్పుకొచ్చారు కపిల్ శర్మ.
21-21-21 రూల్ అంటే..
- ఫిట్‌నెస్ యోగేస్ భటేజా ప్రకారం..మొదటి 21 రోజుల శరీరాన్ని కదలించడంపై దృష్టిపెడతారు. అంటే..వ్యాయామాలు చేయడంపైనే ఫోకస్ ఉంటుంది.
- ఆ తర్వాత 21 రోజులు ఆహారంలో మార్పుల చేయాలి. అంటే కార్బోహ్రైడేట్లు, కేలరీలు తగ్గించాల్సిన అవసరం లేదు. బరువ తగ్గేందుకు సహకరించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.
- చివరి 21 రోజుల చెబు అలవాట్లను దరిచేరనియకుండా పర్యవేక్షించడం. అంటే కేవలం ధూమపానం, మద్యపానం, కెఫిన్ మాత్రేమేకాదు అతిగా తినడం, టీ లేదా కాఫీలే తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం.
- ఇలా ఈ రూల్ని ఎప్పుడైతే 21 రోజుల చొప్పున ఫాలో అవుతామో ఆటోమేటిగ్గా మనం క్రమశిక్షణతో కూడిన జీవన విధానానిక అలవాటు పడిపోతామట. ఇక తినకూడని వాటి జోలికి పొమ్మన్న పోరట.
- ఇలా ఈ ప్రక్రియలో 42వ రోజుకి చేరుకున్నాక..శరీరంల మంచి మార్పులను చవి చూస్తారని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణుడు భటేజా. అయితే శరీర భావోద్వేగాలను నియంత్రిచడమే అత్యంత కీలకం అని చెబుతున్నారు.
అలా 63 రోజుల తర్వాత శరీరంలో పూర్తిగా మార్పుల సంతరించుకోవడమే గాక..దీన్ని కంటిన్యూ చేయలేనేమో అనే టెన్షన్ ఏ మాత్రం రాదట. అది మన దినచర్యలో ఒక భాగమైపోతుందట.
<iframe width="703" height="432" src="https://www.youtube.com/embed/msEgvptkW6I" title="21-21-21 Rule for Fat Loss, Muscle Building and Fitness | Ft. Yogesh Bhateja with Gunjanshouts" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>
(చదవండి: ఈ 'జీరో కేలరీ పుడ్స్'తో దెబ్బకు బరువు మాయం..! ఫిట్‌నెస్ కోచ్ సూచనలు)