
బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్ పాటించినా..ఒక్కోసారి చీట్ మీల్స్ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ సామ్ ఎవెరింగ్‌హామ్. జస్ట్ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..!
కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్‌లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్‌నెస్ కోచ్ సామ్. మరి అవేంటొ చూసేద్దామా..
పూల్‌మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలు
స్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలు
పుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలు
బ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలు
క్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలు
టమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలు
కీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలు
కాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలు
క్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలు
పైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలు
యాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలు
ఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలు
కొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలు
ఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలు
నిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలు
పాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలు
కాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలు
క్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలు
ప్రయోజనాలు..
వీటిలో ఎక్కువగా నీరు, పైబర్‌ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది.
మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్‌నెస్ కోచ్ సామ్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!)