breaking news
Calorie diet
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే హెల్ప్ అయ్యే 'జీరో కేలరీ ఫుడ్స్' ఇవే..
బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్ పాటించినా..ఒక్కోసారి చీట్ మీల్స్ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ సామ్ ఎవెరింగ్హామ్. జస్ట్ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..!కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సామ్. మరి అవేంటొ చూసేద్దామా..పూల్‌మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలుస్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలుపుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలుబ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలుక్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలుటమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలుకీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలుకాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుక్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలుపైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలుయాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలుఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలుకొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలుఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలునిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలుపాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుకాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలుక్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుప్రయోజనాలు..వీటిలో ఎక్కువగా నీరు, పైబర్ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్నెస్ కోచ్ సామ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.చెమటలు చిందించాలి చాలామంది మదిలో మెదిలే ఆలోచన ఇది. కానీ ఇవేమీ లేకుండానే హ్యాపీగా నెలకు 7 కిలల దాకా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఒక వైద్యుడు. అదీ కఠినమైన డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు. మరి ఆ జాదూ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. పదండి.. ఆలస్యం ఎందుకు..!నాన్-ఇన్వాసివ్ కార్డియాలజీలో నిపుణుడైన కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ సోషల్‌మీడియా ద్వారా తన ఫాలోయర్లకు అనేక ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటారు. తాజాగా 'జాదూ డైట్ (మ్యాజిక్ డైట్) ఫర్ వెయిట్ లాస్' అంటూ కొన్ని వివరాలను షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రకారం ఇది శాకాహారంతో బరువు తగ్గించుకునే ఒక ప్రణాళిక. కడుపు మాడ్చుకోవాల్సి అవసరం లేకుండానే సరళమైన డైట్‌తో కేవలం ఒక నెలలో కనీసం 7 కిలోల బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని హామీ ఇస్తున్నారు కూడా.వెయిట్ లాస్ జర్నీ- చిట్కాలుడాక్టర్ బిమల్ ఛాజెర్ చెబుతున్న డైట్ సరళమైన, ఆరోగ్యకరమైన ఆహారాల కలయితో ఉంటుంది. బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదనీ, ఆకలితో ఉండకుండా కేలరీల లోటును భర్తీ చేసి.శరీరం సహజంగా కొవ్వును కరిగించడానికి అనుమతిస్తుంది. ఇదీ చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్‌తో'జాదూ డైట్ ఫర్ వెయిట్ లాస్'మనం మన కడుపును అధిక కేలరీల ఆహారంతో నింపితే, మన బరువు పెరుగుతుంది, అదే తక్కువ కేలరీల ఆహారంతో నింపితే, ఆకలీ వేయదు, బరువూ పెరగదు సింపుల్ మ్యాజిక్ అంటారాయన. స్వీట్ కార్న్, బీట్ రూట్, క్యారెట్లతో చేసిన సలాడ్, గుమ్మడికాయ, బీన్స్, క్యారెట్ ముక్కలు, రాగిపిండితో చేసిన సూప్ ఇలాంటివి ఆయన షేర్ చేసిన వీడియో మనం చూడవచ్చు.జాదూ డైట్లో నిజానికి బాగా తినాలి, కానీ లో-కేలరీల ఆహారాలకు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, సలాడ్లు...ఇది శరీరాన్ని ఆహారం లేకుండా ఉంచకుండా వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఫలితంగా నెలలో 7 కిలోల బరువు తగ్గడం పక్కా..అది కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అని చెప్పారు. View this post on Instagram A post shared by Food Link (@ig_foodlink)ఆహారంగా ఇంకా ఏం తీసుకోవచ్చుబ్లాక్ టీ తాగవచ్చు. ఎక్కువ పండ్లు తీసుకోవాలి. ప్రోటీన్ , ఇతర పోషకాల కోసం మూంగ్ లేదా మసూర్ దాల్ తీసుకోవచ్చు. ఇందులో దోసకాయ, బీట్రూట్ క్యారెట్ ఇలా పచ్చి కూరగాయలతో కలిపి పప్పును తినవచ్చు.రాత్రి భోజనంలో సూప్‌తో పాటు సలాడ్ , ఉడికించిన కూరగాయలుఎన్ని రోజులు చేయాలి?ఈ డైట్‌ను కేవలం ఒక నెల పాటు మాత్రమే సాగించాలి.దీన్ని ఎప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ డైట్‌తో మీరు సుమారు 3 నెలల్లో 10-20 కిలోలు తగ్గవచ్చు. ఈ జాదూ డైట్ అద్భుతంగా పనిచేస్తుందనంటూ కోలకత్తాకు చెందిన ఒక మహిళ 86 నుంచి -62 కిలోలకు బరువు తగ్గిన వైనాన్ని ఉదహరించారు.గమనిక: ఈ కథనం డా. బిమల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం అందించినంది మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం. -
తగ్గినా.. పెరిగినా.. అనారోగ్యమే..
వస్తువుల్ని తూకమేసి అమ్మడం తెలిసిందే.. కానీ కొలత వేసి తినడం ఇప్పుడు సిటీజనులు అలవాటు చేసుకుంటున్నారు. సుషు్టగా తినడానికి బోలెడన్ని అవకాశాలున్నా వాటిని సరిగ్గా జీరి్ణంచుకునేందుకు తగిన శారీరక శ్రమ లేని నేపథ్యంలో నగరవాసుల ‘పొట్ట’తిప్పలు కొత్త దారి పట్టాయి. అవసరాన్ని మించిన ఆహారం ఆరోగ్యానికి చేటు అని గుర్తిస్తూ.. తింటున్న ఆహారాన్ని కొలిచే పనిలో పడ్డారు. వీరికి నగరంలో చెఫ్‌లు, న్యూట్రిషనిస్ట్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన తరగతులు ఉపకరిస్తున్నాయి. ఎంత వరకూ యాప్్ట? పలు యాప్స్ సిటీజనుల ఆహారపు అలవాట్లను పర్యవేక్షిస్తున్నాయి. తింటున్న ఆహారం ద్వారా వారికి అందుతున్న కేలరీలను అవి ఖర్చవుతున్న తీరూ చెబుతున్నాయి. అయితే కొన్ని యాప్స్ అమెరికన్/విదేశాల ఫుడ్ వాల్యూస్‌తో తయారైనవి కాబట్టి మనకి అవి పూర్తిగా కరెక్టా కాదా? అనేది ఖచి్చతంగా చెప్పలేమని న్యూట్రిషనిస్ట్‌లు అంటున్నారు. మెనూలోనూ సమాచారం.. నగరంలోని పలు స్టార్ హోటల్స్, టాప్‌క్లాస్ రెస్టారెంట్లు తమ వంటకాల మెనూలోనే కేలరీల సమాచారాన్ని కూడా పొందుపరుస్తున్నాయి. రెస్టారెంట్స్‌లో తినడం అనే అలవాటు నగరాల్లో పెరిగిపోయిన నేపథ్యంలో 2022లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఎఐ) రెస్టారెంట్లు తమ మెనూలోని వంటకాలు అందించే కేలరీల గణనను తప్పనిసరిగా పేర్కొనాలని ఆదేశించింది. దాంతో పలు స్టార్ హోటల్స్ ఈ ఆదేశాలను పాటిస్తుండటం వల్ల నగరవాసులకు తాము తీసుకుంటున్న ఆహారం అందించే కేలరీలపై అవగాహన ఏర్పడుతోంది. కేలరీస్.. కేర్‌ఫుల్ ప్లీజ్.. అధిక కేలరీల వల్ల ఊబకాయం, డయాబెటిస్, కేన్సర్ తదితర వ్యాధులకు దారితీస్తుంది. తగినంత కేలరీలు పొందకపోవడం పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. అంటువ్యాధులు, ఆందోళన ఏకాగ్రత లోపం పెంచుతుంది. అధిక కేలరీల భారం లేకుండా కీలకమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు తృణధాన్యాలు వంటి పూర్తి, ప్రాసెస్ చేయని ఆహారాలను తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారాన్ని ప్రోత్సహించడానికి చిన్న ప్లేట్లు గిన్నెలను ఉపయోగించడం ద్వారా అతిగా తినడం తగ్గించాలి. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ సాధారణంగా పోషకాలు లేనివిగా, అధిక కేలరీలు కలిగి ఉంటాయి. అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాలను ఎంచుకోవాలి. ప్రతి భోజనం నిదానంగా చేయాలి.. నెమ్మదిగా నమలాలి, ప్రతి బైట్‌ను ఆస్వాదించడానికి పరధ్యానాన్ని వదలాలి. రెగ్యులర్ శారీరక శ్రమ శక్తిని ఖర్చు చేయడం ద్వారా కేలరీలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన–తీవ్రతతో వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.రుచికన్నా మన శరీరానికి కలిగే లాభం మిన్న అనే ఆరోగ్య స్పృహ నగరవాసుల్లో బాగా పెరిగిందని నగరానికి చెందిన చెఫ్ కుమార్ అంటున్నారు. గతంలో అత్యంత రుచికరమైన వంటలు ఎలా చేయాలో అడిగిన మహిళలు ఇప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారం గురించి అడుగుతున్నారని చెప్పారు. తరచూ తాము నిర్వహిస్తున్న స్మార్ట్ స్నాకింగ్ సెషన్స్‌లో ఒక్కోసారి ఒక్కో దినుసుతో ఆరోగ్యకరమైన వంటలు ఎలా చేయాలో నేర్పుతున్నామని, ఈ క్లాసెస్‌కి ఆదరణ బాగుందన్నారు. అవగాహన తరగతులూ షురూ.. ‘బాదం పప్పులు రోజువారీగా ఆహారంలో తీసుకోవడం మంచిది. కేవలం 4 పప్పులు తీసుకుంటే 29గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 322 మి.గ్రా కాల్షియం, 987 మి.గ్రా పొటాíÙయం, 322 మి.గ్రా కాల్షియం, 16.2 మి.గ్రా పీచు పదార్థాలు, 460 మి.గ్రా సోడియం.. వగైరాలు లభిస్తాయి’.. శ్రీనగర్‌కాలనీలో తన కుమార్తెకు వివరంగా చెబుతున్న మధ్యవయస్కురాలైన సుగుణ ఇటీవల తాజ్ డెక్కన్ హోటల్లో ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోరి్నయా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరవడం ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోగలిగారు. ఇదేవిధంగా నగరానికి చెందిన మరి కొందరు గృహిణులు సైతం పోషకాహారంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆచి తూచి.. ఆలోచించి..ఆహారం మీద సిటిజనుల్లో అవగాహన పెరగడం మంచి పరిణామమే. కానీ ఇంకా చాలా విషయాల్లో సరిపడా లేదనే చెప్పాలి. ఉదాహరణకు టీలు, కాఫీలు తాగితే ఏమీ కాదనుకుంటారు. కానీ టీ లేదా కాఫీ కూడా రోజుకి 2 కప్పులు మించకూడదు. దానిలో ఉండే పంచదార, పాలు కేలరీలను పెద్ద సంఖ్యలోనే జమ చేస్తాయి. అలాగే ఆల్కహాల్ తాగితే ద్రవమే కదా కేలరీలు రావనుకుంటారు. కానీ 1ఎం.ఎల్ఆల్కహాల్తో 7 కేలరీలు వస్తాయి. దానికి తోడు మంచింగ్ పేరుతో స్నాక్స్ అవీ జత చేస్తే మరింత హాని కలుగుతుంది. ఒకటే ఆహార పదార్థం ఇంట్లో వండిన దానికి బయట కొన్న దానికి కేలరీల్లో చాలా తేడా ఉంటుంది. బయట వండేవారు రుచి కోసం కలిపే నూనెలు, ఉప్పులు, దినుసుల వల్ల ఆ తేడా వస్తుంది. కూల్ డ్రింక్స్ కూడా అధికంగా కేలరీలను అందిస్తాయి. సగటున ఒక వ్యక్తి 1800 నుంచి 2200 వరకూ కేలరీలను తీసుకోవచ్చు. అయితే శారీరక శ్రమ, చేసే పని బట్టి ఇందులో కొద్దిగా మార్పు చేర్పులు ఉంటాయి. జాగ్రత్త పడినా బరువు పెరుగుతున్నామంటే మనం పాటిస్తున్న, అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లలో లోపం ఉన్నట్లే భావించి తగిన వైద్య సలహా తీసుకోవాలి. – డా.జానకి, న్యూట్రిషనిస్ట్ -
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
వివాహ వంటకాల్లో విందులు ఓ రేంజ్లో ఉంటాయి. బాగా డబ్బున్న వాళ్లైతే భోజనంలో లెక్కపెట్టలేనన్ని వెరైటీలతో అతిథులను ఆశ్చర్యపరుస్తారు. కానీ ఇలా ఫిట్‌నెస్‌పై కేర్ తీసుకునే విధంగా ఆతిథ్యం ఇవ్వడం గురించి విన్నారా..?. అలాంటి వినూత్న ఆలోచనకు తెరతీశారు పశ్చిమబెంగాల్లోని ఓ కుటుంబం. తమ ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొనే అతిథులంతా అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావించారో ఏమో..! గానీ భలే అద్భుతంగా మెనూ అందించి విందు ఏర్పాటు చేశారు. వచ్చినవారంతా వారెవవ్వా..ఏం ఉంది ఈ మెనూలో వాటి వివరణ అని మెచ్చుకుంటున్నారు.ప్రస్తతం ప్రజలంతా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా పడితే అలా తినేందుకు ఇష్టపడటం లేదు. ఏది ఎంతవరకు తింటే మంచిదో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఇలాంటి వివాహ వేడుకలో కూడా వారి డైట్‌కి ఇబ్బంది గలగకుండా జాగ్రత్త తీసుకుంటూ తాము అందించే వంటకాల కేలరీలను సవిరంగా మెనూలో అందించారు. అంతేగాదు ఈ విందులో నచ్చినవన్నీ తినండి..అలాగే అధిక కేలరీలను బర్న్ చేసుకునేందుకు ఈ వేడుకలో ఏర్పాటు చేసే ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్వంటి కార్యక్రమాల్లో పాల్గొనండి చాలు. జీఎస్టీ ఏం ఉండదూ కూడా అంటూ చమత్కారంగా రాశారు. ఇక్కడ ఆ మెనూలో ఆరోగ్య స్ప్రుహ తోపాటు, ఆహారం వృధాను నివారించేలా విందును ఆస్వాదిద్దాం అని పిలుపునివ్వడం విశేషం. ఇంకో విషయం కూడా జత చేశారు..ఎంజాయ్ చేద్దామనే వచ్చాం కాబట్టి..దాన్ని మిస్ చేసుకోకుండా కంఫర్ట్‌గా ఉండమని మెనూ చివరలో సూచించారు. అందుకు సంబంధించిన విషయాలను రెడ్డిట్ వినియోగదారుడు నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లంత ఇది వివాహ మెనూ కాదు..'కేలరీల మోమో' అంటూ ప్రశంసిస్తున్నారు.(చదవండి: 65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?) -
ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక
లండన్: ఒక పిజ్జా కొంటే రెండో పిజ్జా ఫ్రీ, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ వంటి ఆఫర్లను మనం చూసే ఉంటాం. అయితే బ్రిటన్‌లో ఇలాంటి ఆఫర్లకు అడ్డుకట్ట పడబోతోంది. అంతేకాదు ప్రతి ఆహారం వల్ల ఎంత కేలరీల శక్తి వస్తుందో ఆయా వివరాలను కూడా రెస్టారెంట్లు మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ఆలోచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఆలోచనలు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా కూర్చొని తినేవారి సంఖ్య పెరగడం, దాంతో ఊబకాయం కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తోంది. ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో ఉన్నవారేనని సమాచారం. యువకుల్లో మూడింటి రెండొంతుల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారని, 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంటోంది. బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ప్రధాని జాన్సన్ అన్నారు. -
బాటిల్లో భోజనం!
టెక్ టాక్ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు వేల కేలరీల ఆహారం అవసరమని.. ఇందులో అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండాలని శాస్త్రం చెబుతోంది. మరి... ఇలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందీ అంటే మా సూపర్ డ్రింక్ ట్రై చేయండి అంటోంది శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆంపుల్ మీల్స్’ సంస్థ. ఆహారం పేరు చెప్పి డ్రింక్ గురించి చెబుతున్నారేమిటని ఆశ్చర్యపోకండి. ఇక్కడ అవి రెండూ ఒక్కటే. ఎందుకంటే ఆంపుల్మీల్స్ ఒకపూట భోజనంలో ఉండాల్సినన్ని ఆరోగ్యకరమైన అంశాలన్నింటినీ బాటిల్లోకి చేర్చేసింది మరి! మనం చేయాల్సిందల్లా ఈ బాటిల్లోకి కొన్ని నీళ్లు/పాలు చేర్చుకోవడం... బాగా కదిలించి గొంతులోకి దింపేసుకోవడమే! చిలగడదుంపల నుంచి గుమ్మడి విత్తనాల వరకూ పాలకూర నుంచి అరటిపండు వరకూ అన్ని రకాల ఆహార పదార్థాల్లోని పోషకాలను దీంట్లో మేళవించారు. కొవ్వుల కోసం ఏమేం కలిపారో, ప్రొటీన్ల కోసం వాడినవి ఏమిటో... ఈ బాటిల్‌పైన ఉంటాయి. మీ శారీరక అవసరాలను బట్టి 400, 600 కిలో కేలరీల విభాగాల్లో దొరుకుతోంది ఈ సూపర్ డ్రింక్. వంట తంటా లేకుండా ఆరోగ్యకరమైన ఆహారమన్నమాట!