
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్‌లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్‌లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు.
VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:
"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025