
చెన్నై: కేరళకు చెందిన మలయాళ సినీ నటి వర్మిని మునీర్, సినిమాల్లో అవకాశం కల్పిస్తాని చెప్పి తన బంధువు అయిన ఓ 14 ఏళ్ల బాలికను కేరళ నుంచి చెన్నైకి తీసుకువచ్చింది. ఆ నటి, ఆ అమ్మాయి తిరుమంగళం ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేస్తున్నారు. ఆ సమయంలో, నటి ఉంటున్న గదికి నలుగురు యువకులు వచ్చారు. వారు బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనికి నటి మిను మునీర్ కూడా సహకరించారని తెలు స్తోంది. దీంతో బాలిక వారి నుంచి తప్పించుకుని కేరళకు వెళ్లిపోయింది.
ఈ సంఘటన జరిగి 10 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాధితు రాలు తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించికేరళ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బాలికతో నిర్వహించిన విచారణలో, తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటన చెన్నైలోని తిరుమంగళంలోని ఓ లాడ్జిలో జరిగినట్లు తేలడంతో కేరళ రాష్ట్ర పోలీసులు చెన్నై పోలీసులకు సమాచారం అందించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, తిరు మంగళం మహిళా పోలీసులు, నటి ప్రోద్బలంతో బాలికను లైంగికంగా వేధించిన సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దీని తరువాత, మల యాళ నటి మిను మునీర్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నటిని చెన్నైకి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.