
తిరువణ్ణామలై: తమిళనాడు:రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఏపీకి చెందిన యువతిపై తమిళనాడు పోలీసులు అత్యారానికి పాల్పడ్డారు. తిరువణ్ణామలైలో ఏపీకి చెందిన యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్స్ సుందర్ రాజ్, సురేష్ రాజ్‌లు సదరు యువతిపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. అత్యాచారం చేసిన పోలీసులను అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిన్న రాత్రి(సోమవారం, సెప్టెంబర్ 29వ తేదీ) తిరువణ్ణామలై సమీపంలోని ఎంథాల్ బైపాస్ రోడ్డుపై ఈ దారుణం చోటు చేసుకుంది. టమోటో లోడ్‌తో వెళుతున్న వాహనంలో డ్రైవర్‌తో పాట ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ సమయంలోనే గస్తీ కాస్తున్న ఇ ద్దరు పోలీసులు.. ఆ వాహనాన్ని ఆపారు. వాహనంలో ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిన ఆ ఇద్దరు పోలీసులు.. మహిళల్ని కిందకు దింపారు. అందులో లక్ష్మీ అనే యువతిని విచారణ పేరతో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారం చేసే సమయంలో ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడి బైపాస్ రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి వచ్చిన గ్రామస్తులు లక్ష్మిని రక్షించి, 108 అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న తిరువన్నమలై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధాకర్, అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ సతీష్ బాధితురాలిని విచారణ చేశారు. దాంతో పోలీసలే తనను కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారని సదరు బాధితరాలు చెప్పడంతో అసల విషయం వెలుగచూసింది.
ఇదీ చదవండి:
తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు