తమిళనాడులో ఘోరం.. 38మంది మృతి | Stampede in Vijays campaign in tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోరం.. 38మంది మృతి

Sep 28 2025 4:47 AM | Updated on Sep 28 2025 7:25 AM

Stampede in Vijays campaign in tamilnadu

విజయ్‌ ప్రచారసభకు భారీగా హాజరైన అభిమానులు

విజయ్‌ ప్రచారంలో తొక్కిసలాట

38మంది మృతి

25 మంది పరిస్థితి విషమం

మరో45 మందికి గాయాలు 

మృతుల్లో 8 మంది పిల్లలు,16 మంది మహిళలు 

కరూర్‌లో విషాదం 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం 

అర్ధరాత్రి ఘటనాస్థలికి సీఎం స్టాలిన్‌

నేడు బాధితులకు పరామర్శ

సాక్షి, చెన్నై: తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ శనివారం రాత్రి  తమిళనాడులోని కరూర్‌లో నిర్వ హించిన ‘మీట్‌ ది పీపుల్‌’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పో యారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.  మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మహిళలు ఉన్నారు. వీరు కాకుండా 45 మందికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

ఈ ఘటనపై పోలీసుల భద్ర తా వైఫల్యంపై తీవ్ర  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా క్ష త గాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు భారీ స్థాయిలో వైద్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు,  క్షతగాత్రుల కు లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 

ఘటనపై విచార ణకు రిటైర్డ్‌ జస్టిస్‌ అరుణా జగదీశన్‌ ఏకసభ్య కమిషన్‌ ఏర్పా టు చేస్తూ స్టాలిన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాల యంలో సమీక్ష అనంతరం పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడానికి అర్ధరాత్రి ఘటనా స్థలికి సీఎం స్టాలిన్‌ బయలుదేరా రు. ఈ దుర్ఘటనపై  24 గంటల్లో నివేదికను సమ ర్పించాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

సభాస్థలికి ఏడు గంటల ఆలస్యంగా..
సినీ నటుడు విజయ్‌ తమిళగ వెట్రి కళగం పేరిట గత ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా  ప్రజలలోకి చొచ్చుకు వెళ్లేందుకు  ఈ నెల 13వ తేదీ నుంచి  మీట్‌ ది పీపుల్‌ పేరుతో ప్రచార సభ నిర్వహిస్తూ వస్తున్నారు.  ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని ఆయన పర్యటన చేస్తున్నారు. ఇందులో అధికార డీఎంకేను తీవ్రంగా విజయ్‌ టార్గెట్‌ చేస్తున్నా రు. అలాగే బీజేపీని ఫాసిస్టులు అంటూ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. 

ఈ క్రమంలో తాజాగా శనివారం ఉదయం నామక్కల్‌లో ఆయన పర్యటించారు. ఇక్కడి  కేఎస్‌ థియేటర్‌ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి,  జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు  కరూర్‌ నగరంలోని వేలు స్వా మి పురం సభాస్థలికి చేరుకున్నారు. 

దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్‌ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి  పదుల సంఖ్యలో వాటర్‌ బాటిళ్లను విజయ్‌ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. 

విజయ్‌ వెళ్లిన కొదిసేపటికే...
విజయ్‌ వెళ్లిన కాసేపట్లోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇరుకైన రోడ్లతో కూడిన ప్రాంతం, పరిసరాలు  కావడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులలో జనం తల్లడిల్లారు. జనం రద్దీ ఒక్క సారిగా పెరగడంతో తోపులాట, తొక్కిస లాటతో అక్కడి వాతావరణం తీవ్ర ఉత్కంఠ భరితంగా మారింది. ఊపిరి ఆడక పోవడంతో సొమ్మ సిల్లే వారి సంఖ్య పెరిగింది.  క్షణాలలో పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు అక్క డికి చేరుకున్నాయి. అస్వస్థతకు గురైన వారందర్నీ ఆస్ప త్రులకు తరలించారు. 

పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు నిమి షాల వ్యవధిలో బాధితులతో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకు న్నాయి. ఒక్కో అంబులెన్స్‌లో ఇద్దరు, ముగ్గుర్ని తీసు కొచ్చారు. ఒకే స్ట్రక్చర్‌లో ఇద్దరి లోనికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి కొందరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 45 మంది చికిత్సలో ఉండగా, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. 

మిన్నంటిన రోదనలు
ప్రచార సభకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో పలు కుటుంబాలు తీవ్రంగా రోదిస్తూ ఆస్పత్రులకు పరుగులు తీశాయి. ఆస్పత్రి మార్చురీ పరిసరాలు ఆప్తులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి.  పరిస్థితి దారుణంగా మారడంతో నామక్కల్, తిరుచ్చి జిల్లాల నుంచి వైద్య బృందాలు హుటా హుటిన కరూర్‌కు చేరుకున్నాయి. కరూర్‌ జిల్లా కలెక్టర్‌ తంగవేల్, ఎమ్మెల్యే , మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను తక్షణ చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరిస్థితి తక్షణ సమీక్షకు విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్, ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్‌ను కరూర్‌కు పంపించారు.  ప్రైవేటు ఆసుపత్రులలో ఉన్న వారందరికీ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని  ఎమ్మెల్యే సెంథిల్‌ బాలాజీ ప్రకటించారు.   ఇక, సీఎం స్టాలిన్‌ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సచివాలయానికి చేరుకుని కరూర్‌ పరిస్థితిపై సమీక్షించారు. అటు తర్వాత అర్ధరాత్రి ఘటనా స్థలికి బయలుదేరారు. 

అంబులెన్స్‌తో గందరగోళం..
కాగా  సభా సమయంలో విజయ్‌ పార్టీ వర్గాలు అటుగా వచ్చిన ఒక అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా, డ్రైవర్‌ పైదాడి చేసినట్టు తెలుస్తోంది.   ఈ సమయంలో పోలీసులు  లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి చేజారినట్లు సమాచారం. పోలీసుల ముందస్తు భద్రతా చర్యలలో వైపల్యాలపై విమర్శలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, సినీ నటుడు రజనీకాంత్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

విషణ్ణ వదనంతో వెళ్లిపోయిన విజయ్‌..
కాగా, ఈ ప్రమాద ఘటనపై తిరుచ్చి విమానాశ్రయంలో విజయ్‌ను మీడియా ప్రశ్నించడంతో,  ఆయన మౌనంగా విషణ్ణ వదనంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

పోలీసులు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే.. 
తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. పోలీసులు వీటికి తగినంత భద్రత కల్పించాల్సి ఉంది. అప్పుడే తొక్కిసలాటలను నివారించొచ్చు. కానీ పోలీసులు విజయ్‌ సభకు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే తాజా దుర్ఘటన జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. 

విజయ్‌ అభిమానులు సైతం ఈ విషయంలో స్టాలిన్‌ ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపడుతున్నారు. తగినంత మంది పోలీసులను కేటాయించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. విజయ్‌ ప్రచార సభ కోసం కరూర్‌లో సభాస్థలిని పోలీసులే ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది. విజయ్‌పార్టీ వర్గాలు మరో ప్రదేశాన్ని కోరితే, చివరకు పోలీసులు ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇరుకైన రోడ్లతో కూడిన ఈ ప్రాంతంలో వేలాది మంది చేరడమే ఘటనకు దారితీసినట్లు విమర్శలు వస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement