
జైపూర్: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు ఒకరు దారుణానికి ఒడిగట్టారు. తన ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యనే కిరాతకంగా హత్య చేశారు. అయితే, ఆమెను దొంగలు హత్య చేసినట్టు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన బీజేపీ నాయకుడు రోహిత్ సైనీ. ఆయనకు సంజుతో కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే, రోహిత్‌కు రీతు సైనీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ రెండేళ్లుగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. రీతు సైనీ అప్పటికే వివాహం కాగా.. భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తనకు అడ్డుగా ఉన్న సంజును ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని రీతు సైనీ ప్లాన్ చేసింది. ఆమెను హత్య చేయాలని భర్త రోహిత్, అతడి ప్రియురాలు ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగా ఆగస్టు పదో తేదీన తమ ప్లాన్ ప్రకారం సంజును వారు హత్య చేశారు. అనంతరం, రోహిత్ సైనీ.. పోలీసులను, కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా.. ఆరోజు రాత్రి తన ఇంట్లో దోపిడీ జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలే.. సంజును హత్య చేశారని తెలిపాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారం, డబ్బులు దొంగతనం చేసి.. సంజును హత్య చేశారని పేర్కొన్నాడు.
अजमेर के किशनगढ़ में भाजपा नेता रोहित सैनी ने प्रेमिका के साथ मिलकर पत्नी संजू सैनी की हत्या की थी। प्रेमिका भी मर्डर की प्लानिंग में शामिल थी। प्रेमिका तलाकशुदा है और प्राइवेट स्कूल में टीचर है। उसके एक चार साल की बेटी भी है।
एडिशनल एसपी (ग्रामीण) दीपक कुमार ने बताया- शिवाजी… pic.twitter.com/2eqNWhWyrk— Rajasthan One (@rajasthanone11) August 17, 2025
దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో రోహిత్, రీతు సంబంధం గురించి బయటకు వచ్చింది. ఈ క్రమంలో తమదైన తీరులో పోలీసులు.. రోహిత్‌ను ప్రశ్నించగా.. అసలు నేరం ఒప్పుకున్నాడు. అనంతరం, రోహిత్, రీతును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరెస్టులను రూరల్ అదనపు ఎస్పీ దీపక్ కుమార్ ధృవీకరించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించామని ఆయన అన్నారు.