
ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ దిగ్గజం జేబీటీ మారెల్ భారత్‌లో తమ గ్లోబల్ ప్రొడక్షన్ సెంటర్ (జీపీసీ)ని ఏర్పాటు చేసింది. పుణెలో ప్రారంభించిన ఈ సెంటర్ .. భారత్, ఆసియా పసిఫిక్ మార్కెట్లలోని తమ కార్యకలాపాలకు అవసరమైన సొల్యూషన్స్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది.
ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, పర్యావరణహితమైన ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలకు ఉపయోగపడే అధునాతన ప్రక్రియలను రూపొందించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఈవీపీ అగస్టో రిజొలొ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. తయారీ జీడీపీలో సుమారు 12 శాతం వాటాతో, 80 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.