లాక్‌హీడ్ మార్టీన్ ఆఫర్
మారియెటా (యూఎస్): సైనిక రవాణా అవసరాల నిమిత్తం 80 భారీ విమానాల కొనుగోలుకు మోదీ సర్కార్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వందల కోట్ల డాలర్ల విలువైన ఆ కాంట్రాక్టు కోసం అతి పెద్ద రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్‌హీడ్ మార్టీన్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో కలిసి బిడ్ వేయడం విశేషం.
తమ సీ–130జే సూపర్ హెర్క్యులెస్ భారీ విమానాలు భారత అవసరాలకు సరిగ్గా సరిపోతాయని ఈ అమెరికా దిగ్గజం తాజాగా పేర్కొంది. ఈ భారీ కాంట్రాక్టు లభిస్తే విమానాల తయారీకి భారత్‌లోనే మెగా హబ్ ఏర్పాటు చేస్తామని భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికా బయట తాము ఇలాంటి ప్లాంటు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అవుతుందని గుర్తుచేసింది. సీ–130జే సిరీస్‌లో లాక్‌హీడ్ ఇప్పటిదాకా 560కి పైగా విమానాలను సరఫరా చేసింది. అవి 23 దేశాల్లో సేవలందిస్తున్నాయి.
మన వాయుసేవ వద్ద ప్రస్తుతం ఈ శ్రేణికి చెందిన 12 విమానాలున్నాయి. రవాణా అవసరాలతో పాటు నిఘా, ఎల్రక్టానిక్ వార్‌ఫేర్, గాలింపు, రెస్క్యూ మిషన్ల వంటి అవసరాల నిమిత్తం సీ–130జే శ్రేణిలో ప్రత్యేక కని్ఫగరేషన్లను సంస్థ అమరుస్తుంటుంది. ప్రస్తుతం డి్రస్టిబ్యూటెడ్ అపర్చర్ సిస్టమ్ తదితరాలతో వాటిని మరింత ఆధునీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఆ్రస్టేలియాతో పాటు జపాన్ కూడా సీ–130జే రవాణా విమానాల కొనుగోలు యోచనలో ఉన్నాయి. భారత వాయుసేన ప్రస్తుతం రవాణా అవసరాలకు సోవియెట్ కాలం నాటి ఏఎన్–32, ఐఎల్–76 రకం విమానాలపై ఆధారపడుతోంది.


