
పుణెలో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం ఈ ప్రమాదానికి గురైంది. విమానాన్ని నడుపుతున్నప్పుడు, టైర్లలో ఒకటి దెబ్బతిన్నట్లు పైలట్ గమనించాడు. పైలట్ ఉదయం 8 గంటల ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు.
దీంతో విమానం ల్యాండింగ్ తర్వాత ముందు చక్రం ఊడిపోయింది. విమానం టాక్సీవే నుంచి దారితప్పి విమానాశ్రయంలోని ఒక వైపు పొదల్లోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. పైలట్ సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు.
మరోవైపు, విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు అడ్డురావడంతో పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేయడానికి ప్రయత్నించాడని అయితే, తిరిగి రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిండంతో ఈ సమయంలో విమానం ముందు చక్రం ఊడిపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.