ముంబైలో కూలిన ప్రైవేటు హెలికాప్టర్‌.. | Helicopter With 4 On Board Crashes Amid Heavy Rain In Pune, Check More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు వస్తుండగా ముంబైలో కూలిన ప్రైవేటు హెలికాప్టర్‌.. నలుగురికి గాయాలు

Aug 24 2024 4:02 PM | Updated on Aug 24 2024 5:49 PM

Helicopter With 4 On Board Crashes Amid Heavy Rain In Pune

ముంబై: మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని పౌద్‌ సమీపంలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ కూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌, ముగ్గురు ప్రయాణికులున్నట్లు తేలింది. పైలట్‌తో సహా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

పుణెలో కురుస్తున్న భారీ వర్షాలతో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్‌ కూలినట్ల పూణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement