పుణె పోర్షే కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్‌ | Two Police Suspended In Pune Porsche Car Accident For Not Following Protocol, More Details Inside | Sakshi
Sakshi News home page

Pune Porsche Car Accident: పుణె పోర్షే కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్‌

Published Fri, May 24 2024 9:45 PM

Two Police Suspended In Pune Porsche Car Accident

పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాద ఘటనలో శుక్రవారం(మే24) ఇద్దరు పోలీసులు సస్పెండ్‌​ అయ్యారు. ప్రమాదం గురించి వైర్‌లైస్‌ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్‌ చేశారు.

కారును రియల్టర్‌ విశాల్‌ అగర్వాల్‌ కుమారుడు నడపలేదన్నట్లుగా చిత్రీకరించేందుకు సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నం జరిగిందని పుణె పోలీసు కమిషనర్‌ చెప్పారు. ‘మా వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌ ఉంది. 

కారు నడిపిన మైనర్ ప్రమాదానికి ముందు మందుతాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో సెక్షన్‌ 304 వర్తిస్తుందనడానికి కావాల్సిన అన్ని ఆధారాలున్నాయి’అని తెలిపారు. పోర్షే కారు ప్రమాదంలో అనీష్‌, అశ్వినీ అనే  ఇద్దరు 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.  

Advertisement
 
Advertisement
 
Advertisement