‘భారత్‌ ఫోర్‌కాస్టింగ్‌ సిస్టమ్‌’ నేడు ఆవిష్కరణ  | Government to unveil Bharat Forecasting System on 26 May 2025 | Sakshi
Sakshi News home page

‘భారత్‌ ఫోర్‌కాస్టింగ్‌ సిస్టమ్‌’ నేడు ఆవిష్కరణ 

May 26 2025 4:45 AM | Updated on May 26 2025 4:45 AM

Government to unveil Bharat Forecasting System on 26 May 2025

న్యూఢిల్లీ:  వాతావరణ పరిస్థితులు, వర్షాల విషయంలో మరింత కచ్చితత్వంతో సమాచారం అందించడానికి ఉద్దేశించిన ‘భారత్‌ ఫోర్‌కాస్టింగ్‌ సిస్టమ్‌’ను ప్రభుత్వం సోమవారం ఆవిష్కరించనుంది. పుణేలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటియోరాలజీ(ఐఐటీఎం) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇకపై స్థానికంగా వాతావరణ పరిస్థితులను కచ్చితత్వంతో  వెల్లడించడానికి వీలవుతుందని కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్‌ తెలిపారు.  బీఎఫ్‌ఎస్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ జాతికి అంకితం ఇవ్వనున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement