ministry of earth sciences
-
‘భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్’ నేడు ఆవిష్కరణ
న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితులు, వర్షాల విషయంలో మరింత కచ్చితత్వంతో సమాచారం అందించడానికి ఉద్దేశించిన ‘భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్’ను ప్రభుత్వం సోమవారం ఆవిష్కరించనుంది. పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇకపై స్థానికంగా వాతావరణ పరిస్థితులను కచ్చితత్వంతో వెల్లడించడానికి వీలవుతుందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ తెలిపారు. బీఎఫ్ఎస్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జాతికి అంకితం ఇవ్వనున్నారు. -
కేంద్ర కేబినెట్లో మార్పులు.. కిరణ్ రిజిజుకు షాకిచ్చిన మోదీ సర్కార్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించారు. కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ను నియమించారు. కిరన్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖను అప్పగించారు. కాగా అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా న్యాయశాఖ బాధ్యతలు అప్పగించారు. చదవండి: Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కన్నుమూత -
సాగరతీరాన్నిశోధిద్దాం..
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపాన్లు, రుతుపవన సీజన్లో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల, కాలుష్య కారకాలు పెరుగుతున్న నేపథ్యంలో సాగర తీరంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోనే రెండో అతి పెద్ద తీర రేఖ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీరం కోతకు గురవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధనలు చేస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్‌సీసీఆర్) ఏపీ తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తీరంలో తలెత్తుతున్న అలజడులపై పరిశోధనలు నిర్వహిస్తూ.. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు ఉపక్రమించేలా పక్కా ప్రణాళికలతో అడుగులేస్తోంది. డాల్ఫిన్ నోస్‌పై 5.5 ఎకరాల విస్తీర్ణంలో.. విశాఖ నగరానికి పెట్టని కోటలా.. రక్షణ వ్యవస్థకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న డాల్ఫిన్ నోస్‌పై ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. పరిశోధన కేంద్రంతో పాటు ఎర్త్‌సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మస్తున్నారు. లేబోరేటరీ భవనం, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్‌హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్‌తో పాటు ఇతర భవనాలను నిర్మించనున్నారు. మన తీరంలో ఉన్న సమస్యలపై ముఖ్యంగా ఈ కేంద్రం పరిశోధనలు చేయనుంది. ప్రతి సమస్యపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి.. సమస్య నివారణకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను తయారు చేయనుంది. దీని ద్వారా ఏఏ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. తీరంలో ఎక్కడెక్కడ ఎంత మేర కాలుష్యం ఉంది? దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది? దీని వల్ల సముద్రాల్లో వస్తున్న మార్పులు, మడ అడవులు విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు.. తదితర వాటిపై నిరంతరం పరిశోధనలు ఇకపై విశాఖ కేంద్రంగా జరగనున్నాయి. ఏపీ సముద్ర జలాల పరిరక్షణకు కృషి విశాఖలో నిర్మిస్తున్న పరిశోధన కేంద్రం ద్వారా సముద్రజలాల నాణ్యత మానిటరింగ్, ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకోసిస్టమ్ సర్వీస్ , సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై పరిశోధనలు చేస్తాం. సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తాం. ఈ కేంద్రం ద్వారా ఏపీ సముద్ర జలాల పరిరక్షణకు ఎన్‌సీసీఆర్ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాం. – డా.ఎంవీ రమణమూర్తి, ఎన్‌సీసీఆర్ డైరెక్టర్ -
రుతుపవనం లో తటస్థంగా లానినా
న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ‘లానినా’ తటస్థంగా ఉంటుందనీ, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్ సోమవారం చెప్పారు. ఎల్ నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహా సముద్ర జలాలు వేడెక్కితే, లానినా వల్ల చల్లబడతాయి. సాధారణంగా ఎల్ నినో వల్ల తక్కువ వర్షాలు కురిస్తే, లానినా వల్ల మంచి వానలు పడతాయి. ‘ప్రస్తుతం లానినా ఓ మాదిరిగా ఉంది. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే సమయానికల్లా అది తటస్థంగా ఉంటుంది. సముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) ఈసారి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది’ అని రాజీవన్ వెల్లడించారు. -
మార్చి 9న ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: మార్చి 9న ఆకాశంలో అద్భుతం జరగనుంది. రోజూ తెల్లవారగానే అరుణ వర్ణంలో శోభించే సూర్యుడిని చూస్తాం. కానీ మార్చి 9న మాత్రం పాక్షికంగా ఉదయించే సూర్యుడిని గమనించొచ్చు. తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాలకు ప్రారంభమయ్యే సూర్యగ్రహణాన్ని భారత దేశంలోని వాయువ్య రాష్ట్రాల వారు తప్ప అందరూ చూడొచ్చని ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే బుధవారం ఉదయం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో గ్రహణం కనబడుతుంది. హైదరాబాద్‌లో ఉదయం 6.29 నుంచి 6.47 వరకు 18 నిమిషాలపాటు, నల్లగొండ జిల్లాలో 6.26 నుంచి 6.47 వరకు 21 నిమిషాల పాటు, చెన్నైలో ఉదయం 6.21 నుంచి 6.47 వరకు, ఢిల్లీలో 6.38 నుంచి 6.44 వరకు, కోల్‌కతాలో 5.51 నుంచి 6.05 వరకు గ్రహణాన్ని వీక్షించొచ్చు. భారత్‌తోపాటు థాయ్‌లాండ్, ఇండొనేషియా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఉత్తర పసిఫిక్ సముద్రప్రాంతంలో ఈ గ్రహణం కనబడుతుంది. గ్రహణం ఉదయమే సంభవిస్తున్నా.. నేరుగా చూస్తే కళ్లకు ప్రమాదం.