వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్‌ | Pune Floods:Man Turns Disaster into Opportunity Netizen funny comments viral video | Sakshi
Sakshi News home page

వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్‌

Jun 8 2024 9:59 PM | Updated on Jun 8 2024 9:59 PM

Pune Floods:Man Turns Disaster into Opportunity Netizen funny comments viral video

ముంబై: మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం భారీగా వాన కురిసింది. భారీ వానకు ఓ రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి పరుపుపై వాన నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

నీటితో నిండిన రోడ్డుపై ఒక వ్యక్తి పరుపుపై తేలుతూ ముందుకు వెళ్లాడు. అయితే అతని పక్కనే కొన్ని వాహనాలు కూడా వెళ్లటం ఆ వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో నెటిజన్లు భిన్నంగా స్పందింస్తున్నారు. పలువురు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

‘నీటిలో పరుపు బైక్‌ రైడ్‌ బాగుంది’,‘నీటిలో ఆ వ్యక్తి  పరుపుతో బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు’అని కామెంట్లు చేస్తున్నారు. అలా వెళ్లటం చాలా ప్రమాదకరం అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. మరికొందరు మాత్రం వాన పడినప్పుడు రోడ్లు ఇలా మారితే పరిస్థితి ఏంటని పశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement