Live Updates
Cyclone Montha Live Updates: బిగ్ అలర్ట్.. కాకినాడకు చేరువలో మోంథా
నెల్లూరులో ముందుకొచ్చిన సముద్రం
- మోంథా తుపాను ప్రభావంతో నెల్లూరులో వర్షాలు
- మైపాడు బీచ్ వద్ద 50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
- పర్యాటకులెవరూ అటు పక్క వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు
- తీర ప్రాంతాలను మైక్ సెట్‌ల ద్వారా అప్రమత్తం చేస్తున్న పోలీసులు
మోంథా డేంజర్ బెల్స్
- డేంజర్ బెల్స్ మెగిస్తున్న సైక్లోన్ మోంథా
- కాకినాడ 270 కి.మీ. దూరంలో ఉన్న తీవ్ర తుపాను
- తీరాన్ని సమీపించే కొద్దీ మరింత ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న మోంథా
- కాకినాడ ఉప్పాడలో అల్లకల్లోలంగా సముద్రం
- కాకినాడ పోర్టుకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ (10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక) జారీ
- విశాఖ గంగవరం, భీమునిపట్నం.. కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్-9 జారీ
- మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకూ 8వ ప్రమాద హెచ్చరికలు జారీ
- పోర్టుకు సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం
మరింత తీవ్రరూపం దాల్చిన మోంథా
- కాకినాడకు 270km దూరంలో కేంద్రీకృతం
- తీర ప్రాంతంలో పెరిగిన ఈదురు గాలులు
- సముద్రంలో ఎగసి పడుతున్న రాకాసి అలలు
- రాష్ట్రమంతటా కురుస్తున్న వర్షం
- కాకినాడ నుండి విశాఖ వరకు తీర ప్రాంతంలో భారీ వర్షాలు
- రాత్రికి తీరం దాటనున్న మోంథా
- మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం
- కృష్ణా, కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాలపై మోంథా ప్రభావం తీవ్రం
- భారీ వర్షాలు, గాలులతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మోంథా
- గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిన తుపాను
- ప్రస్తుతానికి మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకి 270 కి.మీ, విశాఖపట్నానికి 340 కి.మీ దూరంలో కేంద్రీకృతం
- ఈ రోజు రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం
- తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
- దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
- కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
- ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
కాకినాడ తీరం దిశగా దూసుకువస్తున్న మోంథా తుపాను
- ముందు జాగ్రత్తగా జిల్లాలో మూడు హెలీపాడ్లు ఏర్పాటు
- కాకినాడ ,పిఠాపురం, తాళ్ళ రేవు లలో హెలిపాడ్లు సిద్ధం చేస్తున్న అధికారులు
- జిల్లాలో తుపాను ప్రభావిత మండలాలు 12, గ్రామాలు 67, మున్సిపాలిటీలు 5
- తుపాను ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న అధికారులు
- కోస్టల్ ఏరియాకీ సమీపంలో ఉన్న దాదాపు నాలుగు లక్షల మంది
- కాకినాడ నుండి విజయవాడకు 12, విశాఖపట్నానికి 8 బస్సు సర్వీసులు రద్దు
- చెన్నై, తిరుపతి, కడప, కర్నూలు, భద్రాచలం బస్సు ఇవాళ రద్దు
మోంథా ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
ఇవాళ ఎయిర్ ఇండియాకి చెందిన విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటన
గన్నవరం ఎయిర్ పోర్టు పై మోంథా తుపాను ఎఫెక్ట్
ఉదయం 10:30 గంటల తర్వాత నిలిచిపోనున్న అన్ని విమాన సర్వీసులు
ఇప్పటికే అన్ని సర్వీసులను రద్దు చేసుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ( మొత్తం 8 సర్వీసులు)
ఢిల్లీ, ముంబై నుంచి వచ్చే ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు (మొత్తం 3 సర్వీసులు)
ఈ ఉదయం 10:30 వరకూ మాత్రమే తమ సర్వీసులను నడపనున్న ఇండిగో సంస్థ
ఉదయం 10:30 తర్వాత అన్ని సర్వీసులను రద్దు చేసుకున్న ఇండిగో సంస్థ (మొత్తం 15 సర్వీసులు)
విమాన సర్వీసులు రద్దైన నేపధ్యంలో పాసింజర్లకు పలు సూచనలు చేసిన ఎయిర్ పోర్టు అధికారులు
ఎయిర్ పోర్టుకు వచ్చే ముందు హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి చెక్ చేసుకోవాలి
మోంథా తుపాను వేళ అద్భుత ఫలితాలనిస్తున్న గ్రామ సచివాలయాలు
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన వైఎస్ జగన్
తీర ప్రాంత గ్రామాల్లోని సచివాలయాల్లో అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్ కాస్టింగ్ టెక్నాలజీ
తుపాను హెచ్చరికల కేంద్రాలుగా మారిన గ్రామ సచివాలయాలు
గ్రామ సచివాలయాల ద్వారా మోంథా తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం
కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంతా గ్రామాల్లో తుపానుపై సచివాలయాల ద్వారా ప్రజలకు హెచ్చరికలు
విద్యుత్ అంతరాయం జరిగినా 360° హార్న్ స్పీకర్ వ్యవస్థతో హెచ్చరికలు చేసేలా ఏర్పాటు
తమిళనాడులో భారీ వర్షాలు
కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోత
చెన్నైలో ఎడతెరిపిలేకుండా వర్షం
చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
తెలంగాణపై మోంథా తుపాను ఎఫెక్ట్
- తెలంగాణలోని 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుకు భారీ వర్ష సూచన
- నేడు తెలంగాణలోని 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
- తమిళనాడులో భారీ వర్షాలు
- కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోత
- చెన్నైలో ఎడతెరిపిలేకుండా వర్షం
- చెన్నై,తిరువళ్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
ఏపీలో తీరం అల్లకల్లోలం
- విశాఖలోని పెదజాలరిపేట తీరం వద్ద ఈదురుగాలులకు ఊగిపోతున్న చెట్లు
- కాకినాడకు చేరువలో తుపాను.. కోస్తాకు గండం
- ఏపీపై పెను ప్రభావం.. తెలంగాణలోనూ భారీ వర్షాలు
- ఏపీలో 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్, తెలంగాణలో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
- విశాఖలో భారీ ఈదురు గాలులు, ఎడతెగని వర్షం
- హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతికి పలు విమానాలు రద్దు
- 30కిపైగా విమానాలు, 97 రైలు సర్వీసుల రద్దు
- కాకినాడ– అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుపాను తీరాన్ని దాటే అవకాశం
- తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. ప్రచండ వేగంతో గాలులు
కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు..
- రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు
- కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి
- తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది
- తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది
- రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది
- మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది.
- బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
‘మోంథా’ పెను ముప్పు!
- పెను ఉప్పెనలా దూసుకొస్తోన్న మోంథా తుపాను
- ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి
- రోడ్డు మార్గాలు జలమయం
- రైలు మార్గాలను భయపెడుతున్న ముంపు ముప్పు
- భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి
- పెను తుపాను కారణంగా పలు విమానాలను రద్దు
- బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే విమానాలు రద్దు
- దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్ల రద్దు
- సముద్రం అల్ల కల్లోలం కావడంతో స్తంభించిపోయిన జల రవాణా
- పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు
- నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి


