ఇన్వెస్టర్స్‌ అలర్ట్‌: ఇవిగో ‘న్యూ ఫండ్‌ ఆఫర్స్‌’ | investors alert new fund offers icici kotak mahindra mutual funds launch | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్స్‌ అలర్ట్‌: ఇవిగో ‘న్యూ ఫండ్‌ ఆఫర్స్‌’

Jun 1 2026 2:23 PM | Updated on Jun 1 2026 2:34 PM

investors alert new fund offers icici kotak mahindra mutual funds launch

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కొత్తగా స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (సిఫ్‌) కేటగిరీలో రెండు ఫండ్స్‌ని ఆవిష్కరించింది. ఐసిఫ్‌ యాక్టివ్‌ అసెట్‌ అలొకేటర్‌ లాంగ్‌–షార్ట్‌ ఫండ్, ఐసిఫ్‌ ఈక్విటీ లాంగ్‌–షార్ట్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఈ రెండు ఫండ్‌ ఆఫర్లు జూన్‌ 02 వరకు అందుబాటులో ఉంటాయి. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా లాంగ్‌–షార్ట్‌ పొజిషన్లు తీసుకోవడం, డెరివేటివ్స్‌ ద్వారా రిస్క్‌లను అదుపులో ఉంచడంలాంటి విధానాలతో మెరుగైన రాబడులు అందించేందుకు ఈ వ్యూహాలు పని చేస్తాయని సంస్థ ఈడీ శంకరన్‌ నరేన్‌ తెలిపారు.

మొదటిది ఈక్విటీ, డెట్, కమోడిటీస్‌ డెరివేటివ్స్, ఇన్విట్స్‌ మొదలైన వాటికి నిధులు కేటాయిస్తుంది. రెండోది వివిధ మార్కెట్‌ క్యాప్స్‌వ్యాప్తంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.  డెరివేటివ్స్‌ వ్యూహాన్ని కూడా పాటిస్తూ మెరుగైన రాబడులు అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ తరహా సిఫ్‌లో తొలిసారి ఇన్వెస్ట్‌ చేస్తున్నవారు కనీసం రూ. 10 లక్షలు, ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన వారు రూ. 10,000 నుంచి వీటిలో పెట్టుబడులు పెట్టొచ్చు.  

కోటక్‌ ఎంఎఫ్‌ నిఫ్టీ ఫండ్‌ 
కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా నిఫ్టీ ఆల్ఫా లో–వోలటైలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది జూన్‌ 12తో ముగుస్తుంది. ధరల పరంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా విస్తృత మార్కెట్‌కి మించి రాణించగలిగే అవకాశాలున్న 30 సంస్థలు ఈ ఇండెక్స్‌లో ఉంటాయి. పరిస్థితులను బట్టి ఈ స్టాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ ఎండీ నీలేష్‌ షా తెలిపారు.  

మహీంద్రా మాన్యులైఫ్‌ ‘ఎంపవర్‌ సిఫ్‌’ 
సిఫ్‌ కేటగిరి కింద మహీంద్రా మాన్యులైఫై మ్యుచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘ఎంపవర్‌ సిఫ్‌’ని ఆవిష్కరించింది. ఈ తరహా ఫండ్స్‌లో లాంగ్‌–షార్ట్‌ పొజిషనింగ్, డెరివేటివ్స్‌ ఆధారిత వ్యూహాలు కూడా అమలు చేస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మరింత మెరుగైన రాబడులను అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని సంస్థ ఎండీ ఆంథోని హెరెడియా తెలిపారు. ఎంపవర్‌ సిఫ్‌ కింద ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్సిడ్‌ ఇన్‌రం కేటరిగీలవ్యాప్తంగా వివిధ వ్యూహాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement