ఏపీ తీరంలో మోంథా అలజడి | Cyclonic Storm Montha Effect on AP And Telangana Oct 27th Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఏపీ తీరంలో మోంథా అలజడి

అత్యవసరమైతే మాత్రమే బయటకు రండి: నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

  • నెల్లూరు జిల్లాలో వర్షం మొదలైంది
  • ఈ రాత్రికి జిల్లా లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • తీరం వెంబడి 9 మండలాల్లోని 42 గ్రామాలకు హై అలెర్ట్ ప్రకటింఛాం.
  • NDRF SDRF బృందాలు సిద్దంగా ఉన్నాయి..
  • ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయక చర్యలకు బృందాలు సిద్దంగా ఉన్నాయి.
  • సోమశిల వరద పెరిగితే నీట మునిగే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నాం.
  • ప్రజలు అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలి
2025-10-27 10:26:42

మొదలైన మోంథా అలజడి

  • ఏపీ తీర ప్రాంతాల్లో అలజడి రేపుతున్న మోంథా తుపాను
  • కాకినాడ సముద్ర తీరంలో అల్లకల్లోలంగా సముద్రం
  • తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షం
  • ఇవాళ రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు
  • అన్ని ఓడరేవుల్లో కొనసాగుతున్న ప్రమాద హెచ్చరికలు
  • అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు
  • బీచ్‌, పర్యాటక ప్రాంతాలు తాత్కాలికంగా మూసివేత
  • ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులను వెనక్కి పంపుతున్న అధికారులు
2025-10-27 10:06:21

నెల్లూరుపై మొదలైన మోంథా ప్రభావం

  • నెల్లూరులో మొదలైన మోంథా ప్రభావం
  • కురుస్తున్న భారీ వర్షాలు
  • అప్రమత్తంగా ఉన్న అధికార యంత్రాంగం
     
2025-10-27 10:06:21

దూసుకొస్తు‍న్న మోంథా తుపాను

  • దూసుకొస్తున్న మోంథా తుపాను
  • ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు.
  • ఆందోళనలో ఉప్పాడ తీర ప్రజలు
  • పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళాలని అధికారుల ఆదేశం
2025-10-27 09:48:40

దిశ మార్చుకోనున్న మోంథా

  • 36-48 గంటల్లో తీరం దాటే అవకాశం
  • కాకినాడ వద్ద తీరాన్ని తాకే సమయంలో గమనం మార్చుకోనున్న మోంథా
  • ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న తుపాను
  • ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి.. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం
  • సాయంత్రానికి కాకినాడ-తుని వద్ద తీరం దాటనున్న మోంథా
2025-10-27 09:47:04

విజయనగరం తుపాను కంట్రోల్ రూమ్‌ల నెంబర్లివే..

  • మొoథా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలకు చాన్స్‌ 
  • విజయనగరం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల మొదలు.. అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవులు 
  • అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి ఆదేశం

విజయనగరం తుపాను కంట్రోల్ రూముల వివరాలు
కలెక్టర్ ఆఫీస్ : 08922-236947, 8523876706, 
రెవెన్యూ డివిజినల్ ఆఫీస్, విజయనగరం 8885893515,
రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ చీపురుపల్లి 9704995807.
రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ బొబ్బిలి 9989369511.
మున్సిపల్ కార్పొరేషన్ విజయనగరం 9849906486
ఏపీ ఈపీడీసీఎల్ 9490610102
టోల్ ఫ్రీ నెంబర్ 1912.

2025-10-27 09:47:04

తరుముకొస్తున్న మోంథా

  • నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మోంథా తుపాను
  • గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిన తుపాను
  • ప్రస్తుతానికి చెన్నైకి 560కి.మీ, కాకినాడకి  620 కి.మీ., విశాఖపట్నంకి  650 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం
  • పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం
  • తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
  • వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా చేయొద్దని.. అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచన
2025-10-27 09:47:04

విశాఖలో మొదలైన వాన

  • విశాఖను కమ్మేసిన కారు మబ్బులు
  • విశాఖలో మొదలైన వాన
  • తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
2025-10-27 09:47:04

మోంథా ఎఫెక్ట్‌.. తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

  • తెలంగాణపై మోంథా సైక్లోన్‌ ప్రభావం
  • తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ
  • భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
  • 11 జిల్లాలకు ఎల్లో, 9 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
  • ఆదిలాబాద్‌, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి కి వర్ష సూచన
  • సిద్ధిపేట, సూర్యాపేటలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే చాన్స్‌
     
2025-10-27 08:28:34

మత్స్యకారులకు హైఅలర్ట్‌

  • మోంథా నేపథ్యంలో మత్స్యకారులకు హైఅలర్ట్‌
  • ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ
  • విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి వేటకెళ్లిన 82 బోట్లు ఇంకా సముద్రంలోనే!
  • తుపాను ప్రభావంతో అలజడిగా మారిన సముద్రం
  • తక్షణం వెనక్కి రావాలని ఆదేశాలు జారీ
  • నౌక మిత్ర యాప్‌ ద్వారా హెచ్చరికలు పంపిస్తున్న యంత్రాంగం
  • సమీపాల్లో ఉన్న హార్బర్‌లకు వెళ్లిపోవాలని సూచన
     
2025-10-27 08:28:34

బలపడిన మోంథా

  • నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను
  • అర్ధరాత్రి తుఫానుగా బలపడినట్టు ప్రకటించిన ఐఎండీ
  • ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా 16 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న సైక్లోన్‌ మోంథా
  •  కాకినాడకి ఆగ్నేయంగా 680 కి.మీ., విశాఖపట్నం  ఆగ్నేయంగా 710 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • రేపు ఉదయానికి  తీవ్ర తుఫానుగా మారే అవకాశం  
  • రేపు సాయంత్రం కాకినాడ దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా
  • తీరం దాటేసమయంలో గరిష్టంగా గంటకు 90-100 కి.మీ. వేగంతో గాలులు
  • ఇవాళ, రేపు ఏపీ అంతటా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
2025-10-27 08:09:52

విశాఖలో సైక్లోన్ అలెర్ట్

  • మోంథా తుపాను నేపథ్యంలో అన్ని పర్యాటక కేంద్రాలు మూసివేత
  • వైజాగ్ బీచ్ లోకి నో ఎంట్రీ
  • కైలాసగిరి, వుడా పార్క్, మ్యూజియం, సబ్ మెరైన్ సహా పలు టూరిజం స్పాట్స్ మూసివేత
  • తుఫాన్ కారణం నిర్ణయం తీసుకున్న వీఎంఆర్‌డీఏ
2025-10-27 08:09:52

రైల్వే జోన్‌ హైఅలర్ట్‌

  • మోంథా నేపథ్యంలో రైల్వే జోన్‌ హైఅలర్ట్‌
  • రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్‌ వ్యవస్థపై నిఘా
  • అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం చేసిన అధికారులు
  • ట్రాక్‌, సిగ్నలింగ్‌, విద్యుత్‌ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలు
  • విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్‌ రూమ్‌లు
  • తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న వాల్తేరు డీఆర్‌ఎం
     
2025-10-27 07:25:55

ఏలూరుపై మోంథా ప్రభావం

  • మోంథా కారణంగా అప్రమత్తమైన  ఏలూరు అధికారులు
  • నేడు, రేపు స్కూళ్లకు సెలవులు
  • గోదావరి నదిలో పర్యాటక లాంచీలు నిలిపివేత
  • అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు
  • సాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు 94910 41419, 18002331077
2025-10-27 07:25:55

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 3 రోజుల సెలవులు

  • మోంథా కారణంగా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌
  • మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
  • విజయవాడ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు.. నెంబర్‌ 915497045


 

 

2025-10-27 07:24:30

విజయనగరంలో..

  • విజయనగరంపై మోంథా ఎఫెక్ట్‌
  • భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం
  • అప్రమత్తమైన అధికార యంత్రాంగం
  • విజయనగరం జిల్లాలో మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
  • నేటి నుంచి మూడు రోజులపాటు ప్రకటించిన కలెక్టర్‌
  • తుపాను నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు
     
2025-10-27 07:15:52

రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌

  • మోంథా తుపాను నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • నెల్లూరు, కోనసీమ, శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌
  • ఒక్కో జిల్లాకు 30 మందితో కూడిన బృందం
  • ఇప్పటికే కాకినాడ చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌
  • తుపానుతో కాకినాడపైనే ఎక్కువ ప్రభావం పడొచ్చంటున్న వాతావరణ శాఖ
2025-10-27 07:13:12

అప్రమత్తమైన ఉమ్మడి విశాఖ అధికార యంత్రాంగం

  • విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రెండ్రోజులపాటు స్కూళ్లకు సెలవు
  • నేడు, రేపు సెలవు ప్రకటించిన కలెక్టర్‌
  • మోంథా తుపాను కారణంగా సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు

 

 

2025-10-27 07:08:45

మొదలైన మోంథా ఎఫెక్ట్‌

  • ఏపీ వైపు దూసుకొస్తున్నమోంథా
  • కాకినాడ వద్ద మొదలైన మోంథా ఎఫెక్ట్‌
  • అల్లకల్లోలంగా సముద్ర వాతావరణం
  • భారీగా వీస్తున్న గాలులు
  • తీర ప్రాంత మండలాల్లో హైఅలర్ట్‌
  • ఆరు మండలాలపై ప్రభావం చూపే అవకాశం
  • ఈరోజు, రేపు భారీ నుంచి అతి భౠరీ వర్షాలు
  • జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు

 

2025-10-27 07:07:31

కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు

  • మోంథా నేపథ్యంలో స్కూళ్లకు సెలవు
  • కాకినాడలో ఐదు రోజులపాటు సెలవు ప్రకటించిన కలెక్టర్‌
  • కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ
  • ఉప్పాడ-కాకినాడ బీచ్‌ రోడ్డులో రాకపోకలు నిలిపివేత
  • తుపాను కారణంగా బీచ్‌లు మూసివేత
2025-10-27 06:57:18

ఇవాళ ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

  • నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ
2025-10-27 06:57:18

ఏపీకి మోంథా తుపాను ముప్పు

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
  • రేపు ఉదయానికి తీవ్ర తుపానుఆ మారే అవకాశం
  • రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం

 

 

2025-10-27 06:57:18
Advertisement
 
Advertisement

పోల్

Advertisement