సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి (శనివారం) ఈ నెల 26 వరకూ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దానితో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేటలో వేగంగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.


