ఏపీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం విజయనగరం జిల్లాల్లో మరో మూడు గంటల్లో తీవ్ర స్థాయిలో పిడుగులు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలన్నాయంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద హోర్డింగుల వద్ద ప్రజలు నిలబడకూడదని కీలక సూచనలు చేసింది.
కాగా ఇదివరకే పలాసలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు మెరుపులతో భారీ వానలు పడుతుండడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో రేపు పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.


