సాక్షి, యాదాద్రి: యాదగిరి గుట్ట పరిసర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుట్ట శివారులో పులి సంచరిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
గత కొంతకాలంగా ఆవుల్ని, మేకలు చనిపోతుండడంతో మిస్టరీ కొనసాగింది. ఈ క్రమంలో శివారులోని దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యిది. అయితే ఆడ తోడు కోసం బహుశా ఆమ్రాబాద్ అడవుల నుంచి అది వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గుట్టతోపాటు పరిసర ప్రాంత ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు.. పులిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.


