వరుణుడి ప్రతాపంతో తెలంగాణ ఆగమాగం | Telangana Floods: Heavy Rains Cause Disruptions in Kamareddy, Medak, and More | Sakshi
Sakshi News home page

వరుణుడి ప్రతాపంతో తెలంగాణ ఆగమాగం

Aug 27 2025 2:13 PM | Updated on Aug 27 2025 3:51 PM

Telangana Heavy Rains Live Updates

తెలంగాణలో కుండపోత వర్షం.. అప్‌డేట్స్‌

  • మెదక్‌ రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌
  • నీట మునిగిన మహిళా డిగ్రీ కళాశాల
  • విద్యార్థినులను రక్షించిన సహాయక బృందాలు
  • సురక్షిత ప్రాంతానికి 300 మంది తరలింపు
     


     

  • రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న కార్మికులు 
  • ఆరు గంటలుగా సాయం కోసం ఎదురు చూపులు
  • స్వామి అనే కార్మికుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్
  • స్వామితోపాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైనా ఆరా
  • బాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బండి సంజయ్
  • జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పిన కేంద్ర మంత్రి
  • అధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి
     
  • వర్షాలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
  • రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న  భారీ వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
  • కామారెడ్డి ,మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు అలుగులు పొంగి పొర్లుతుండడం ,రోడ్లపై భారీ వరద నీరు వచ్చి చేరుతుండడం ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి .
  • హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీరు నిలువ లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి,
  • భారీ వర్షాలకు వరదల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి
  • లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారిని అక్కడనుండి తరలించేలా చర్యలు తీసుకోవాలి .
  • వర్షాల వల్ల గణేష్ మండపాల వద్ద ,ఇతర విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,
  • ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
     
  • ఉమ్మడి నల్లగొండలో వాన బీభత్సం
  • యాదాద్రి భీమలింగం కత్వా వద్ద వరద ఉధృతి
  • చౌటుప్పల్‌ నాగిరెడ్డిపల్లి మధ్య రాకపోకల బంద్‌
     
  • ఇంకా వరదలోనే మెదక్‌ హవేలిఘన్‌పూర్‌ మండలంలోని దూప్‌సింగ్‌ తండా
  • సాయం కోసం బిల్డింగ్‌ల మీదకు ఎక్కిన జనం
  • రక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు
     
  • కామారెడ్డి కలెక్టర్‌తో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్‌
  • కామారెడ్డి జిల్లా అంతటా భారీ వర్షాలు .. జలదిగ్బంధంలో  పలుగ్రామాలు
  • కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో ఇన్‌చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్‌ 
  • తక్షణ సహాయక చర్యలు కొనసాగుతాయని హామీ
  • అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి సీతక్క
  • ,ప్రతి గ్రామం, పట్టణంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి :మంత్రి సీతక్క
  • లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలి :మంత్రి సీతక్క
  • చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలను అనుమతించొద్దు :మంత్రి సీతక్క
  • ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి :మంత్రి సీతక్క
  • రక్షణ చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోరాదు.. ప్రతి ఒక్క అధికారి తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలి:మంత్రి సీతక్క
  • వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది:మంత్రి సీతక్క
     
  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిన వాయుగుండం
  • రేపూ తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు
  • కుండపోత వానతో రాష్ట్రమంతటా ఆగమాగం
  • జనజీవనం అస్తవ్యస్తం

 


 

  • భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్ల దారి మళ్లింపు
  • కామారెడ్డి మీదుగా వెళ్ళే రైళ్లు నిజామాబాద్ మీదుగా మళ్లింపు
  • నిజామాబాద్ - తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఈ రోజు రద్దు
  • మెదక్ - కాచిగూడ రైలు ఈ రోజు పాక్షికంగా రద్దు
     
  • కామారెడ్డి, మెదక్‌లకు రెడ్‌ అలర్ట్‌ 
  • రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షం
  • రాజంపేట మండలం అర్గొండలో 31.9 సెం.మీ. అత్యధిక వర్షపాతం
  • మెదక్‌ నాగపూర్‌లో 20.8 సెం.మీ. వర్షపాతం
  • బిక్నూర్‌లో 19.1 సెం.మీ
  • టెక్మాల్ మండలంలో 18.03 సెంటీమీటర్ల వర్షపాతం
  • పాత రాజంపేటలో 18, రామాయంపేటలో 16 సెం.మీలు
  • చేగుంట 13.2 సెంమీ, మెదక్‌లో 11 సెం.మీ. 
  • కామారెడ్డి తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్‌ నుంచి నీటి ప్రవాహం.. 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం


 

  • కామారెడ్డి, మెదక్‌ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
  • వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. అన్ని విభాగాల అధికారులు సిద్ధం చేయాలని ఆదేశం
  • ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండండి :సీఎం రేవంత్‌రెడ్డి
  • అన్ని శాఖల అధికారులు.. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సాయం తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశం
  • ఇరు జిల్లాల ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన సీఎం
  • కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన
కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు

 

  • భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై కలెక్టర్ కు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి
  • ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పిన బండి సంజయ్
  • అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడిన బండి సంజయ్
  • ఎల్లారెడ్డిలో తక్షణమే అవసరమైన సాయం అందించాలని ఎన్డీఆర్ఎఫ్ ను కోరిన కేంద్ర మంత్రి
  • జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని సూచంచిన కేంద్ర మంత్రి
     
  • కామారెడ్డిలో భారీ వర్షాలు 
  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు 
  • వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో వరదలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు 
  • డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపులు 
  • ఈ వరద కారణంగా కామారెడ్డి- భిక్కనూర్‌ సమీపంలో రైలు పట్టాల కింద గండి.. రైళ్ల రాకపోకలు నిలిపివేత

  • సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షం
  • ఎగువ మానేరు నుంచి దిగువకు నీరు విడుదల
  • నాగయ్య అనే పశువుల కాపరి గల్లంతు.. గాలిపు చేపట్టిన అధికారులు
  • మానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులు
  • రక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement