హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన | Heavy rain forecast for Hyderabad; police issue alert | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన

Jun 22 2026 4:54 PM | Updated on Jun 22 2026 5:56 PM

Heavy rain forecast for Hyderabad; police issue alert

సాక్షి, హైదరాబాద్: ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్‌కు భారీ వర్షహెచ్చరిక ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం దృష్ట్యా విద్యాసంస్థలు, ఐటీ కార్యాలయాలు త్వరగా విధులు ముగించి  ముందు బయలుదేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచన చేశారు. కాగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  అదేవిధంగా హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement