ఏపీకి భారీ వర్ష సూచన.. ఆరెంజ్‌ నుంచి రెడ్‌ అలర్ట్‌ | Heavy rain in Vijayawada | Sakshi
Sakshi News home page

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆరెంజ్‌ నుంచి రెడ్‌ అలర్ట్‌

Sep 6 2026 3:04 PM | Updated on Sep 6 2026 6:53 PM

Heavy rain in Vijayawada

సాక్షి, అమరావతి: వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్టంలో రానున్న మూడుగంటల్లో  అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  పిడుగులు పడడంతో పాటు ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే  అవకాశం ఉందని పేర్కొంది.  

పెద్దఎత్తున గాలులు వీయడంతో పాటు పిడుగులు పడే  అవకాశం ఉన్నందున  రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని,గాలివాన సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించింది. ​వర్ష తీవ్రత రూపుదాల్చుతున్న దృష్ట్యా, గతంలో జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్‌ను  తాజాగా 'రెడ్ అలర్ట్'గా సవరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement