AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు YSRCP లేఖ | YSRCP letter to the State Election Commissioner | Sakshi
Sakshi News home page

AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు YSRCP లేఖ

Sep 6 2026 4:37 PM | Updated on Sep 6 2026 5:17 PM

YSRCP letter to the State Election Commissioner

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. స్థానిక ఎన్నికల్లో భద్రత కోసం కేంద్ర బలగాల్ని మోహరించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అధికార యంత్రాంగ దుర్వినియోగం, అధికార పార్టీ వ్యక్తుల జోక్యం, బెదిరింపుల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షిపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాల భద్రత అవసరమని తెలిపారు.

"కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి అనధికారికంగా ప్రవేశించారు. పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లను బెదిరించారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కల్పించారు.అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారుచిన్న కొట్టపల్లి పోలింగ్ బూత్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇతర రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు మంత్రి సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్‌పై భౌతిక దాడి చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు" అని తెలిపారు

"అలాగే 2025 ఆగస్టు 7న నాగులదిన్నెవారిపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, పార్టీ నేత వెలుపుల రామలింగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. వాహనాలను ఇనుపరాడ్లు, ఇతర ఆయుధాలతో ధ్వంసం చేశారు.  ఒక ఇంటికి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. 2025 ఆగస్టు 13న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లోని సుమారు 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను బెదిరించారు. రిగ్గింగ్ చేసి, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించారు" అని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి దారుణాలకే తెగపడ్డారని,తుని, పిడుగురాళ్ల, పాలకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికల సమయంలో ఇలాంటి అరాచకాలే చేశారని లేఖలో పేర్కొన్నారు. తునిలో ఎన్నికల ప్రక్రియ గతంలో రెండు సార్లు వాయిదా పడింది. 2025 ఫిబ్రవరి 17న కూడా ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. వైఎస్సార్సీపీ  కౌన్సిలర్ల ఇళ్లపై దాడులు జరిగాయి.కౌన్సిలర్లను బెదిరించేందుకు కొందరు పోలీసు సిబ్బంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో కుమ్మక్కయ్యారన్నారు. పిడుగురాళ్లలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల ఇళ్లను కూల్చివేశారు. పాలకొండలో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానానికి చెందిన ఏకైక వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ను భయపెట్టి, బెదిరించడంతో ఎన్నిక వాయిదా పడిందన్నారు.  

కనుక ఈసారి సైతం ఎన్నికల్లో   స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ, వార్డు స్థాయిలో రాజకీయ పోటీ తీవ్రంగా ఉంటుంది, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష అభ్యర్థులపై బెదిరింపులుకు దిగుతారని నామినేషన్ల దాఖలాకు అడ్డంకులు సృష్టిస్తారని ఎన్నికల సంఘానికి లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాబట్టి పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి , ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రప్పించాలి’ అని లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: 
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement