ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. రాగల మూడు గంటల్లో.. | Heavy Rains: Orange Alert For Eluru Ntr And Krishna Districts | Sakshi
Sakshi News home page

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. రాగల మూడు గంటల్లో..

Sep 6 2026 1:52 PM | Updated on Sep 6 2026 2:43 PM

Heavy Rains: Orange Alert For Eluru Ntr And Krishna Districts

సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని  రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

కాగా, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ.. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement