సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష సూచనలు జారీ చేసింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, యాదాద్రి, ఉమ్మడి మెదక్ జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


