ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా, విపరీతంగా సామాజిక మాధ్యమాలను వాడేస్తున్నారు. అదే సమయంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం సులభమైపోయింది. ముఖ్యంగా ఫేమ్ ఉన్న వారి పేర్లతో ఐడీలు క్రియేట్ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటితో బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించారు.
ఈ నకిలీ ఖాతాలపై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించింది. ఇటీవల తన పేరు, ఫొటో, ఫేక్ నంబర్‌తో మోసం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అభిమానులను అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. ఎవరికైనా ఈ ఫేక్ నంబర్‌తో వస్తే కాల్ రిపోర్ట్ చేయాలని సూచించింది. అది తన అకౌంట్ కాదని.. ఈ సమాచారాన్ని అందించిన వారికి ధన్యవాదాలు అని రాసుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికొస్తే గుంటూరు కారంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన వృషకర్మ కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.



