సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గడ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలతో పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


