గుంటూరు: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై అమానుషంగా దాడిచేసిన ఘటనపై తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ బస్సు వెళ్తోంది. ఆ డ్రైవర్‌ను తలమల ఏసురాజు నడుపుతున్నాడు. బస్సు ముందు బైక్‌పై వెళ్తున్న పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం డ్రైవర్‌పై దాడిచేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్ ఏసురాజును కొట్టిన దుర్గాప్రసాద్ వీడియో ఫేస్‌బుక్‌ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి, నోటీసులు జారీ చేశారు.
ఏపీలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.విధుల్లో ఉండగానే దాడి
⚡ విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ విధులకు ఆటంకం కలిగించి, అతడిపైనే తీవ్రంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.#AndhraPradesh #RTCDriver #Attack #APNews pic.twitter.com/Io5z3XUoOQ— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 11, 2026
ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి


