breaking news
bus dirver
-
ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి
గుంటూరు: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై అమానుషంగా దాడిచేసిన ఘటనపై తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ బస్సు వెళ్తోంది. ఆ డ్రైవర్‌ను తలమల ఏసురాజు నడుపుతున్నాడు. బస్సు ముందు బైక్‌పై వెళ్తున్న పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం డ్రైవర్‌పై దాడిచేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్ ఏసురాజును కొట్టిన దుర్గాప్రసాద్ వీడియో ఫేస్‌బుక్‌ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి, నోటీసులు జారీ చేశారు. ఏపీలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.విధుల్లో ఉండగానే దాడి⚡ విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ విధులకు ఆటంకం కలిగించి, అతడిపైనే తీవ్రంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.#AndhraPradesh #RTCDriver #Attack #APNews pic.twitter.com/Io5z3XUoOQ— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 11, 2026ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి -
బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
-
బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
హైదరాబాద్ : ఎప్పుడూ వచ్చే బస్సు డ్రైవర్ విధుల్లోకి రాకపోవటంతో అతని స్థానంలో విద్యార్థులను తీసుకు వచ్చేందుకు స్కూల్ యాజమాన్యం స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను పంపించినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. రైలు రాదనే ధీమాతో డ్రైవర్ భిక్షపతి బస్సును ముందుకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)


