Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sakshi Editorial On AP TDP Chandrababu Govt and President rule
రాష్ట్రపతి పాలనే శరణ్యం!

‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్‌’ సెటిల్‌ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్‌ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్‌ బుక్‌’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్‌ బుక్‌’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ అంతటా యువనేత, ‘రెడ్‌ బుక్‌’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్‌ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్‌ కౌన్సిలర్‌నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడు, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్‌ జగన్‌ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్‌ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్‌ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్‌ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్‌ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్‌ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్‌లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్‌ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.‘ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్‌ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్‌ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్‌బుక్‌ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్‌రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్‌ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్‌లో తమ ’సూపర్‌ సిక్స్‌’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్‌ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

IS CM Chandrababu Really Insult Senior IAS Piyush Kumar
సీఎంవోలో సీనియర్‌ ఐఏఎస్‌కు అవమానమా?

అమరావతి, సాక్షి: ఆయనో సమర్థవంతమైన ఐఏఎస్‌ అధికారి. డిప్యూటేషన్‌ మీద కేంద్రంలో కీలక శాఖల్లో పని చేసిన అనుభవమూ ఉంది. అయితే ఆయన సేవలు వాడుకుంటామంటూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఇప్పుడు ఖాళీగా కూర్చోబెట్టింది. ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన పీయూష్ కుమార్ కేంద్రంలో డెప్యూటేషన్ పై పని చేసేవారు. ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా విధులు న్విహించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. సీఎం చంద్రబాబు కేంద్రానికి రిక్వెస్ట్‌ పెట్టారు. దీంతో.. కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసింది. వచ్చిరాగానే సీఎం ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా, ఆ వెంటనే ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ వెంటనే రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు హడావిడి చేశారు. అయితే.. తాజాగా సీఎంవోలోని అధికారులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి రవిచంద్ర ముద్దాడా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ముద్దాడా రవిచంద్ర, ప్రద్యుమ్న, రాజమౌళి, కార్తికేయ మిశ్రాలకే శాఖల కేటాయింపు ఉంది. కానీ, పీయూష్‌ కుమార్‌కు మాత్రం ఏ శాఖను చంద్రబాబు కేటాయించలేదు. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.

KSR Comments On TDP-Janasena-BJP Alliance Politics
కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతున్న తీరు, పైశాచికంగా రాజకీయ ప్రత్యర్ధులను నరుకుతున్న వైనం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిపై సైతం దాడులు చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేసిన ఘట్టాలు గమనిస్తుంటే నలభైఆరేళ్ల సీనియర్ చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా? అనే భావన కలగక మానదు. పైకి ఎప్పుడూ నీతులు వల్లిస్తూ, రౌడీయిజంను అణచివేస్తా.. అంటూ కబుర్లు చెప్పడం, దారుణమైన అకృత్యాలు జరుగుతుంటూ మాత్రం చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఆ నేరాలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏపీ ప్రజలు ఇలాంటి పాలననా కోరుకుంది అనిపిస్తుంది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌, తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది. చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు సాగిన విధ్వంసకాండ ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. వారేదో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అంతు చూస్తున్నామని టీడీపీ వారు భావిస్తున్నారేమో తెలియదు కాని, చివరికి జరిగేది ప్రజలే టీడీపీ వారి అంతు చూసే పరిస్థితి వస్తుంది. వినుకొండలో నడిరోడ్డులో కత్తితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను బహిరంగంగా, పాశవికంగా నరికిన ఘటన చంద్రబాబు రాక్షస పాలనకు అద్దం పడుతుంది.గతంలో జగన్ ప్రభుత్వంపై సైకో పాలన అంటూ ఏది పడితే అది మాట్లాడే ఆయన ఇప్పుడు నిజంగానే సైకో అంటే ఎలా ఉంటారో, శాడిజం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేసినవారు తమను తాము నిందించుకునే దశకు తీసుకువెళుతున్నారు. వినుకొండలో పాతపగల కారణంగా హత్య జరిగిందని టీడీపీ వారు, పోలీసులు, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఒకే అదే కరెక్టు అనుకుందాం. పాత పగలు ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చాకే ఎందుకు కత్తితో నరికాడు.31 మందిని రాష్ట్రంలో టీడీపీ వారు హత్య చేసినా ఏమీ కాలేదు కనుక.. ఇప్పుడు తనకు ఏమీ కాదులే.. తమ ప్రభుత్వమే ఉందిలే అనే ధీమాతో కాదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? పైగా మంత్రి లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడు యువగళం యాత్రలో తిరుగుతూ ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం పన్నెండు కేసులు పెట్టించుకోవాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. అలా అయితేనే తనను కలవవచ్చని, పదవులు ఇస్తామని ఆయన అనేవారు. దానిని స్పూర్తిగా తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది వాస్తవం అనిపిస్తుంది.ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ఆఫర్ ఇచ్చేవారు. ఆ ప్రకారం ఇప్పుడు మర్డర్లు చేసినవారికి మంత్రి హోదా ఏమైనా కల్పిస్తారేమో చూడాలి. పుంగనూరులో అరాచకం నానాటికి పెట్రేగిపోతూనే ఉంది. దళిత నేత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు ఏపీలో పోలీసు యంత్రాంగం ఎంత అసర్ధంగా ఉన్నదీ తెలియచేస్తుంది. దీనికి ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా కవరింగ్ ఇవ్వడం గమనిస్తే వీరు ఇంతగా దిగజారారా? అనేది తెలియచేస్తుంది.తాడిచెట్టు ఎందుకు ఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా వీరు ఒక వాదన తయారు చేశారు. కొందరు రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వచ్చిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయిర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారట. అక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ కట్టుకధ అల్లడానికి సిగ్గుండాలి. అసలు ఒక ఎంపీ తన కార్యకర్తలతో సమావేశం అవుతుంటే వేరే పార్టీవారు వెళ్లడం ఏమిటి? ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ది కానప్పుడు మిధున్ రెడ్డి వారి సమస్యను ఎలా తీర్చుతారు.ప్రభుత్వంలో ఉన్నదే టీడీపీ అయితే, ఆ పార్టీవారు వైఎస్సార్‌సీపీ వారిని కోరడం ఏమిటి? అంటే టీడీపీ ప్రభుత్వం అంత అసమర్దంగా ఉందని వారు అనుకున్నారా? పైగా రెడ్డప్ప ఇంటి వద్ద ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, వాహనాలపై రాళ్లు వేయడం, ఒక వాహనాన్ని తగులపెట్టడం.. ఇలా చేసినవారిని రౌడీలు అంటారా? లేక రైతులు అంటారా? టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ దాడుల సంస్కృతి తీవ్రంగా మారిందా అన్న డౌటు వచ్చేలా పాలన సాగుతోందనిపిస్తుంది.1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద పాదిరికుప్పం అనే గ్రామంలో కాంగ్రెస్‌కు ఓటేశారన్న కారణంగా దళితులు కొందరిని, బహుశా ఐదుగురిని అనుకుంటా.. టీడీపీ వారు దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. 1987 ప్రాంతంలో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద దళితులకు ఒక అగ్రవర్ణ సామాజికవర్గానికి మద్య గొడవలలో దళితులు పాతిక మందికిపైగా హత్యకు గురయ్యారు. 1988లో టీడీపీకి చెందినవారు విజయవాడలో నడిరోడ్డులో నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఇలా బహిరంగంగా చంపడం అన్నది టీడీపీ గత చరిత్రలో కూడా ఉందన్నమాట.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆ సందర్భంలో ఒక సామాజికవర్గంవారితో పాటు టీడీపీ వారు కూడా నష్టపోయారు. వ్యక్తిగత కక్షలతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు గొడవలు, హింసాకాండ జరగడం మాత్రం ఇదే అని చెప్పాలి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఘర్షణలు దాదాపు లేవనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో అక్కడక్కడా జరిగినా ఈ స్థాయిలో లేవన్నది వాస్తవం. కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా ఈనాడు వంటి మీడియా బూతద్దంలో చూపడం, తెలుగుదేశం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగేది. అలాంటిది ఇప్పుడు ఇంత దారుణంగా హత్యాకాండ జరుగుతుంటే సంబంధిత వార్తల వాస్తవాలను ఇవ్వకపోగా, ఎదురు బాధితులపైనే నెపం నెడుతూ ఎల్లో మీడియా కధనాలు ఇవ్వడం శోచనీయం.బాధ్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరైన రీతిలో స్పందించకపోవడం సమాజానికి చెడ్డ సంకేతం పంపిస్తోంది. గతంలో లోకేష్ నేరాలు ఎక్కువ చేసినవారికి పెద్ద పదవులు అన్నట్లుగా ఇప్పుడు మర్డర్ చేయడం మంత్రి హోదా కలిగిన పదవికి టీడీపీలో అర్హత పొందినట్లు అవుతుందేమో తెలియదు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు హింసాకాండలో పాల్గొన్నారు. బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది కనుక వారిపై కేసులు పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీరికి పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిలో వారు గొడవలు పడతారో, ఏమో చూడాలి. తాము ఇంతమందిని చంపామని, లేదా ఇంత ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వారిని కొట్టామని, ఇంత పెద్ద ఎత్తున ఇళ్లపై దాడులు చేశామని, కనుక తమకే పదవులు రావాలని డిమాండ్ చేసేలా ఉన్నారు.ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు టీడీపీ వారి ఘాతుకాలను తట్టుకోలేక ఊళ్లు వదలి వెళ్లిపోయారు. సుమారు 500కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీడీపీ వారు ధ్వంసం చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో చలనం లేకపోవడం. కనీసం ఈ దాడులు జరగకుండా చర్యలు చేపట్టండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సలహా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉంది.టీడీపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో బీజేపీ పెద్దలు మౌనం దాల్చారనుకోవాలి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా గత ప్రభుత్వ టైమ్‌లో తన కార్యకర్తలను రెచ్చగొట్టేవారు. వైఎస్సార్‌సీపీ వారిని మెడలు పిసికాలని, కొట్టాలని.. ఇలా ఏవేవో తీవ్రమైన మాటలు చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇందిరాగాంధీ అంతటి గొప్ప నేతే ఎలా ఓటమిపాలైందో చరిత్ర తెలియచేస్తుంది. ఎమర్జన్సీ విదించి ఆమె వందల మంది విపక్షనేతలను జైళ్లలో పెట్టించింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జైళ్ల నుంచి విడుదల అయిన విపక్ష నేతలంతా ఒక్కటే, ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆమెను పరాజయం పాలు చేశారు.రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆ సంగతులన్నీ తెలిసినా చంద్రబాబు పాలన ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది. గత ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ, లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా, అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ఏమి చేస్తాం. ఇలాంటివారిని ఎన్నుకున్నామని ప్రజలు తమ నెత్తి తాము కొట్టుకోవడం తప్ప.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Chief Minister will decide: Udhayanidhi Stalin On speculation on deputy post
ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్‌ ఇదే!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Why this arrogance?: Amit Shah attacks Rahul Gandhi
రాహుల్‌కు ఎందుకింత అహంకారం?: అమిత్‌ షా ధ్వజం

రాంచీ: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో రాహుల్‌ అహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జార్ఖండ్‌లోని రాంచీలోజరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశిస్తూ అమిత్‌షా ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం పెరిగిన కొందరు నాయకులను చాలాసార్లు చూస్తుంటాం. జార్ఖండ్‌లో అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కకూడా అహంకారం కలిగిన వ్యక్తిని నేను తొలిసారి చూస్తున్నాను.లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. ఎవరూ ఓడిపోయారో కూడా తెలుసు.అయినా రాహుల్‌ అనేకసార్లు పార్లమెంట్‌లో అహంకారంగా ప్రవర్తించారు. రాహుల్‌ ఓటమిని అంగీకరించలేపోతున్నారు. అందుకే పార్లమెంట్‌లో ఆ విధంగా ప్రవర్దిస్తున్నారు. మూడింట రెండు వంతుల సీట్లు గెలిచిన(బీజేపీ) పార్టీ నుంచి ప్రజలు ఇంత అహంకారాన్ని ఎదుర్కోవడం లేదు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.ఈ సభ వేదికగా కాంగ్రెస్‌ నేతలకు చెప్పాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. కేవలం బీజేపీకే 240 సీట్లు దక్కాయి. ఇవి ఇండియా కూటమి మొత్తానికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన స్థానాల కంటే ఈసారి బీజేపీ ఎక్కవ గెలుచుకుంది. మేము వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం. కానీ, ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు అంగీకరించలేకపోతున్నారు’’ అని మండిపడ్డారు..అదే విధంగా మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలై మళ్లీ సీఎం బాధ్యతలు స్వీకరించిన హేమంత్‌ సోరెన్‌పై అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిపరమైందని దుయ్యబట్టారు. భూకుంభకోణం, మద్యం, మైనింగ్‌ పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

BJP slams on Pinarayi Vijayan for  blatant overreach Kerala appoints  foreign secretary
‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం సొంతంగా విదేశాంగ కార్యదర్శిని నియమించటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం పినరయి విజయన్‌ కే. వాసుకి అనే ఐఏఎస్‌ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించటంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.‘ఐఏఎస్‌ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించిన కేరళ సీఎం పినరయ విజయన్‌ రాజ్యాంగ నిబంధనలను దారుణంగా ఉల్లంఘించారు. విదేశీ వ్యవహారాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. రాజ్యాంగబద్ధం కాని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా ప్రమాదకరం. సీఎం పినరయి విజయన్‌ కేరళను ప్రత్యేక దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా?’ అని కేరళ బీజేపీ యూనిట్‌ చీఫ్‌ కే.సురేంద్రన్ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.The appointment of an IAS officer as 'Foreign Secretary' in Kerala by CM Pinarayi Vijayan is a blatant overreach and a violation of the Union list of our Constitution. The LDF government has no mandate in foreign affairs. This unconstitutional move sets a dangerous precedent. Is…— K Surendran (@surendranbjp) July 20, 2024 లేబర్‌ అండ్‌ స్కిల్స్‌ సెక్రటరీ కే. వాసుకికి విదేవి వ్యవహారాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతల్లో భాగంగా విదేశీ వ్యవహారాలక సంబంధించిన అంశాలను సమన్వయం చేయనున్నారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ ఎంబసీ, మిషషన్లతో అనుసంధానం చేయటంలో కొత్త నియమించిన విదేశంగా సెక్రటరీ వాసుకికి సహాయం చేయాలని ఢిల్లీలోని కేరళ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కేరళ ప్రభుత్వం చేసిన ఈ నియామకంపై మాజ కెబినెట్‌ సెక్రటరీ కే. ఎం. చంద్రశేఖర్‌ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ‘అంతర్జాతీయ సంబంధాలు కేంద్రం చేతిలో ఉంటాయి. దేశంలోని ఏ రాష్ట్రం విదేశాలకు సంబంధించిన సమాచారం, పనులు కావాలన్నా కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తుంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కొత్తగా నియమించిన విదేశాంగ కార్యదర్శి.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కంటే మించి ఎలాంటి అదనపు పనులను చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి’ అని చంద్రశేఖర్‌ అన్నారు.

CISF Constable Dies After Gun Misfire At Sangareddy
తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి.. సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని బీడీఎల్‌ కంపెనీలో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సులో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతిచెందాడు. సీఐఎస్‌ఎఫ్‌ఎస్‌ యూనిట్‌ లైన్‌ బ్యారెక్‌లో బస్సు దిగే క్రమంలో అతని వద్ద ఉన్న ఇన్సస్‌ రైఫిల్ పేలి తూటా తలలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిని నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన జవాను వెంకటేష్‌గా గుర్తించారు. కాగా వెంకటేష్‌ ఏడాదిన్నర క్రితం ట్రాన్స్ ఫర్ కింద హైదరాబాద్‌ వచ్చి సీఐఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, తొమ్మిదేళ్ల కొడుకు సాయి, ఎనిమిదేళ్ల పాప సాయి పల్లవి ఉన్నారు. తుపాకీ పేలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Senior IAS Officers Transfered In Telangana
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా వికాస్‌ రాజ్‌ బదిలీ అయ్యారు. బదిలీల ప్రకారం.. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా వికాస్‌ రాజ్‌. జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌దత్‌. ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీగా డాక్టర్‌ శరత్‌. రెవెన్యూ స్పెషల్‌ సెక్రటరీగా హరీష్‌. స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మీ. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి అదనపు కలెక్టర్‌గా రాధికా గుప్తా.

Education Department Changes School Timings In Telangana
తెలంగాణలో స్కూల్‌ టైమింగ్స్‌ మార్పు.. విద్యాశాఖ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాల వేళలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.కాగా, తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9-30 నుంచి తొమ్మిది గంటలకు మార్పు చేశారు. అలాగే, సాయంత్రం 4-45కి బదులుగా 4-15 గంటలకు పని వేళలు ముగుస్తాయని విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది.అయితే, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు.

CM Revanth Reddy Attend Kamma Global Federation Summit 2024
కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన

సాక్షి, హైదరాబాద్‌: ‘కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన. అమ్మ బిడ్డ ఆకలి చూస్తుంది. అలాగే భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి పది మందిని బతికించే కులం కమ్మ. కమ్మ వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు కష్టపడనవసరం లేదు. సారవంతమైన భూమి, సాగునీరు ఎక్కడ ఉంటే అక్కడ కమ్మ సోదరులు ఉంటారు.. కష్టపడాలనే మనస్తత్వం కమ్మ వాళ్లది.సమాజ శ్రేయస్సు కోసం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు చేసే కృషికి ప్రభుత్వం తగిన సహకారాన్ని అందిస్తుంది. పది మందికి సాయం చేయాలనే ఆలోచన ఉన్న కమ్మ సోదరులు తమ డీఎన్‌ఏను వదులుకోకుండా ముందుకు సాగాలి..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ (కేజీఎఫ్‌) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే కమ్మ గ్లోబల్‌ సమిట్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఓ బ్రాండ్‌ ‘కమ్మ సామాజిక వర్గం వారితో నాకున్న సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. నన్నెంతో అభిమానంతో చూసుకుంటుంది. నేను అనర్గళంగా మాట్లాడడానికి, తక్షణమే స్పందించడానికి ఎన్టీఆర్‌ లైబ్రరీలో చదువుకున్న చదువు ఎంతో ఉపయోగపడింది. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో, నాయకత్వంలో ఒక బ్రాండ్‌ (ఎన్‌టీఆర్‌ ఈజ్‌ ఏ బ్రాండ్‌ ఫర్‌ పాలిటిక్స్, బ్రాండ్‌ ఫర్‌ లీడర్‌షిప్‌). 1982 కన్నా ముందు కమ్మ ఎమ్మెల్యేలు ఎందరు ఉన్నా, ఎన్టీఆర్‌ ఇచి్చన అవకాశాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో నాయకులుగా ఎదిగారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశానికి మార్గదర్శకం..’రేవంత్‌ అని అన్నారు. గ్లోబల్‌ సిటీగా మార్చడానికి కృషి చేయాలి ‘కమ్మ సామాజిక వర్గం వాళ్లు అన్ని రంగాల్లో ఎదిగారు. ఎన్టీఆర్, ఎన్‌జీ రంగా, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు వంటి వాళ్లు కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సత్య నాదెళ్ల మొదలు ఎందరో ప్రపంచస్థాయి సీఈవోలుగా రాణిస్తున్నారు. కమ్మ సోదరులకు అవకాశాలు కలి్పంచడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. సొంత కులం పట్ల అభిమానం ఉంది. అదే సమయంలో ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణలో కుల వివక్ష ఉండదు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చడానికి దేశ, విదేశాల్లో ఉన్న కమ్మ సోదరులు కృషి చేయాలి. హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి. అందుకోసం కృషి చేయాలి..’సీఎం కోరారు. ఢిల్లీలో తెలుగువాళ్ల నాయకత్వ కొరత‘ఢిల్లీలో తెలుగువాళ్ల రాజకీయ నాయకత్వం కొరత ఉంది. జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్‌ వంటి వాళ్లు ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. కులానికి, ప్రాంతానికి అతీతంగా తెలుగువారు ఢిల్లీలో రాణించేలా ముందుకు రావాలి. కమ్మ సంఘానికి గత ప్రభుత్వం ఇచి్చన ఐదెకరాల స్థలానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించి, భవన నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది..’అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.కాగా తమది దార్శనికతతో కూడిన సామాజిక వర్గమని కేజీఎఫ్‌ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌ అన్నారు. కమ్మ వారి దాతృత్వానికి నాగార్జున సాగర్‌ ఉదాహరణ అని, ముత్యాలరాజా 57 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేశారని గుర్తుచేశారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తమిళనాడు ఎంపీ కళానిధి వీరాస్వామి, కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, సత్యవాణి ప్రసంగించారు.రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మాజీ మంత్రులు వసంత నాగేశ్వర్‌రావు, వడ్డే శోభనాద్రీశ్వర్‌ రావు, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement
National View all
title
నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్‌ విద్యార్థుల అరెస్ట్‌

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసు

title
ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్‌ ఇదే!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక

title
రాహుల్‌కు ఎందుకింత అహంకారం?: అమిత్‌ షా ధ్వజం

రాంచీ: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీప

title
హర్యానా ఎన్నికలపై ఆప్‌ ఫోకస్‌.. ఐదు హామీలు ఇవే..

చండీగఢ్‌: కొద్ది రోజుల పార్లమెంట్‌ ఎన్నికల సమరం ముగిసింది.

title
ఎల్లుండి నుంచే కేంద్ర బడ్జెట్ సమావేశాలు

బడ్జెట్ 2024 సమావేశాలు ఎల్లుండి (జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి.

International View all
title
హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్‌!

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి.. పురిటినొప్పులు పడని స్థితిలో ఉన్న తన తల్లి గర్భం చీల్చుకుని బయటకు వచ్చాడు.

title
పాలస్తీనాకు ఫేవర్‌గా అంతర్జాతీయ కోర్టు.. చరిత్ర ఇదీ అంటూ నెతన్యాహు..

దిహేగ్‌: పాలస్తీనా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమి

title
ఎన్నికల్లో గెలుపు మనదే: కమలా హారీస్‌

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్త

title
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం

గల్ఫ్‌​ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

title
‘ఐఎస్‌ఎస్‌’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్(ఐఎస్‌ఎస్‌) ఫ్యూచరేంటి..?

NRI View all
title
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం

ఆస్టిన్‌: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు.

title
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం

గల్ఫ్‌​ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

title
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా

title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all