బొత్స సత్యనారాయణ మరోసారి కంటతడి.. కీలక వ్యాఖ్యలు | Botsa Satyanarayana Breaks Down at YSRCP District Meet | Sakshi
Sakshi News home page

బొత్స సత్యనారాయణ మరోసారి కంటతడి.. కీలక వ్యాఖ్యలు

Sep 12 2026 2:38 PM | Updated on Sep 12 2026 3:06 PM

Botsa Satyanarayana Breaks Down at YSRCP District Meet

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ విజయనగం జిల్లా సర్వసభ్య సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టారు. నమ్మినవారే మోసం చేశారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చిన్న శ్రీను అంశంపై అమర్నాథ్‌ మాట్లాడుతుండగా బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ తర్వాత ఈ సమావేశంలో బొత్స మాట్లాడుతూ... వెన్నుపోటు పార్టీ అరాచకాలు ప్రజలకు తెలియాలని అన్నారు. వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కార్యకర్తలంతా తలెత్తుకుని తిరిగేలా చేస్తారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. తన సహచరులు కేంద్ర మంత్రులుగా ఉన్నారని చెప్పారు. తనను పిలిచినా వెళ్లకుండా విలువలు కాపాడుకున్నానని అన్నారు. 

2 రోజుల క్రితం కూడా..
బొత్స  మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మారడంతో ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘నమ్మినవాళ్లు మోసం చేశారు’’ అంటూ బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. మళ్లీ శనివారం ఆయన కంటతడి పెట్టడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement