సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పార్టీ క్రెడిట్ చోరీకి పాల్పడిందని కాకాణి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన మంచి పనులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు సర్వహక్కులు కల్పించేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. పేదవాడికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు 13 మంది ST, SC ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కమిటీ వేశారు. చుక్కల భూముల సమస్యను చంద్రబాబు పరిష్కరించలేక పోయారు. కాన్నీ, మేము దానికి శాశ్వత పరిష్కారం చూపాము. నిషేధిత జాబితా నుంచి అడ్డంకులు లేని భూములను తొలగించాం. మేము తీసుకొచ్చిన విధానంతో రైతులకు మేలు జరిగింది. వైఎస్ జగన్‌కి మంచి పేరు రాకూడదనే రీ వేరిఫికేషన్ పేరుతో 27 నెలలు కాలయాపన చేశారు అని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఆ ఆటలేంటి చంద్రబాబు?: వైఎస్ జగన్ సీరియస్


