యానాం వద్ద గౌతమీ గోదావరిలో మత్స్యకారుల వలకు సుమారు 23 కేజీల పండుగప్ప చిక్కింది. స్థానిక పుష్కరఘాట్ వద్ద నిర్వహించిన వేలంలో దీనిని మత్స్యకార మహిళ కొల్లాటి దేవి రూ.10 వేలకు దక్కించుకుంది. పండుగప్ప చేప బరువు సాధారణంగా 12 కేజీల వరకూ ఉంటుంది. ఇంత భారీ చేప వలలో పడటంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– తూర్పు గోదావరి జిల్లా
ఇదీ చదవండి : ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి


