సాక్షి, అమరావతి: ఈ రోజు శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన పడే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందుకు ప్రజలెవరూ చెట్లకింద హోర్డింగుల వద్ద నిల్చోకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.


