AP: మరి కొద్ది సేపట్లో వర్షం?.. వాాతావరణ శాఖ హెచ్చరిక | Rain forecast for several districts of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: మరి కొద్ది సేపట్లో వర్షం?.. వాాతావరణ శాఖ హెచ్చరిక

May 23 2026 4:41 PM | Updated on May 23 2026 4:53 PM

Rain forecast for several districts of Andhra Pradesh

సాక్షి, అమరావతి: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది.  రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  విజయనగరం జిల్లాలో సైతం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

ప్రజలందరూ ఈ సూచనలను పాటించాలని తెలిపింది. 50 నుంచి 60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ క్రింద ఎట్టిపరిస్థితుల్లో నిలబడకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ  ప్రఖర్ జైన్ ఈ హెచ్చరికలను జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement