సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్,జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.


