జన్వాడలో తీవ్ర ఉద్రిక్తత.. | Congress leaders reach Janwada | Sakshi
Sakshi News home page

జన్వాడలో తీవ్ర ఉద్రిక్తత..

Sep 19 2026 2:40 PM | Updated on Sep 19 2026 3:43 PM

Congress leaders reach Janwada

సాక్షి, హైదరాబాద్‌: జన్వాడ ఫాంహౌస్‌ భూముల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు స్పాట్‌లోనే హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఫోన్‌ చేశారు. నాలాను కబ్జాచేసి జన్వాడ ఫాంహౌస్‌ కట్టారని ఫాంహౌస్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వివరించారు. సత్యం రామలింగరాజుకు చెందిన భూముల్లో ఫాంహౌస్ కట్టారు. ప్రదీప్‌రెడ్డికి ఈ భూమి ఎలా వచ్చింది. కేటీఆర్‌, ప్రదీప్‌రెడ్డికి ఎలాంటి అగ్రిమెంట్‌ లేదు.  అని ప్రశ్నించారు. 

కాగా ప్రజాభవన్‌ నుంచి బస్సులో  బృందంగా బయిలుదేరిన నేతలు కాసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. జన్వాడ వద్ద ఫాంహౌస్‌ భూములను కాంగ్రెస్‌ నేతల బృందం పరిశీలించారు. కాంగ్రెస్‌ నేతల పర్యటన నేపథ్యంలో జన్వాడ వద్ద ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement