ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌ | Big Alert To Instagram Users Check New Rules On Hashtags Details Here | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌

Dec 19 2025 1:09 PM | Updated on Dec 19 2025 1:26 PM

Big Alert To Instagram Users Check New Rules On Hashtags Details Here

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తరూల్‌ను తీసుకొచ్చింది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు  తన ఖాతాదారులకు అలర్ట్‌ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్‌స్టాగ్రామ్‌ వాడేవాళ్లకు సూచిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే పోస్ట్‌ లేదంటే రీల్‌కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్‌ట్యాగ్‌లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్‌ ట్యాగ్‌ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్‌ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్‌స్టాలో 30 హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టుకోవడానికి అవకాశముండేది. 

అయితే.. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్‌ట్యాగ్‌లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా.. అదీ నిర్దేశిత హ్యాష్‌ట్యాగ్‌లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. 

ఉదాహరణ: బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్‌కు సంబంధించిన బ్యూటీ హ్యాష్‌ట్యాగ్‌లు వాడితే.. ఆ కంటెంట్‌ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్‌ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్‌ మాత్రమే ఉపయోగించడం బెటర్‌. ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా ఏ హ్యాష్‌ ట్యాగ్‌ను పడితే  ఆ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. 

ఈ నెల ప్రారంభంలో కేవలం 3 హ్యాష్‌ట్యాగ్‌లే ఉపయోగించాలని ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్లను అలర్ట్‌ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్‌ట్యాగ్‌ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.

హ్యాష్‌ట్యాగ్‌లంటే(#).. కంటెంట్ డిస్కవరీకి ఉపయోగపడేవి. సంబంధిత టాపిక్ సెర్చ్‌లలో, ట్రెండింగ్ లిస్టుల్లో, సెర్చ్‌ (Explore) ఫీడ్‌లో కనిపించే అవకాశం ఉంటుంది. సరైన హ్యాష్‌ట్యాగ్‌లు వాడితే మీ కంటెంట్‌ను నిజంగా ఆసక్తి ఉన్నవారు చూసే అవకాశం పెరుగుతుంది. కానీ సంబంధం లేనివి.. అడ్డగోలుగా ఎక్కువ వాడితే కంటెంట్‌ పనితీరు తగ్గి.. ఎవరికి పడితే వాళ్లకు వెళ్తుంది. అలాగే ఇన్‌స్టా ఆల్గారిథమ్‌ ప్రకారమూ స్పామ్‌గా పరిగణించి రీచ్ తగ్గుతుంది. కాబట్టి ఇన్‌స్టాలో మాత్రమే కాదు.. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్‌లోనూ తక్కువగా, సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు వాడటం ఉత్తమని నిపుణులు చెబుతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement