breaking news
Komuravelli Mallanna Temple
-
యంగ్ హీరోతో కలిసి గుడిలో నాగదుర్గ పూజలు.. ప్రేమలో ఉన్నారా?
సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కామన్. హీరోహీరోయిన్ల సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా పుకార్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి, ప్రేమకు సంబంధించిన విషయాలపై రకరకాలు గాసిప్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఫోక్ డ్యాన్సర్, హీరోయిన్ నాగదుర్గపై కూడా ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె యంగ్ హీరో అఖిల్ రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి గల కారణం.. వీరిద్దరు కలిసి ఇటీవల గుడికి వెళ్లి పూజలు చేయడమే.‘రాజు వెడ్స్ రాంబాయి’మూవీతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు అఖిల్ రాజ్. మరోవైపు ఫోక్ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ..ఇటీవల సినిమాల్లోకి అడుగుపెట్టింది. తమిళంలో లవ్ ఓ లవ్ సినిమాతో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ప్రియదర్శితో కలిసి ‘ఇడుపు కాయితం’ అనే మూవీ చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న వీరిద్దరు కలిసి సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. లవ్‌లో ఉన్నారు కాబట్టే కలిసి గుడికి వెళ్లారని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడతున్నారు. మరికొంతమంది మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతుందని..అందుకే గుడికి వెళ్లారని కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే.. అఖిల్ రాజు లేదా నాగదుర్గ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. Akhil Raj & folk dancer Naga Durga spotted together at a Telangana temple, sparking curiosity! 👀🤨No official word yet, but the buzz is growing! 🔥#AkhilRaj #NagaDurga pic.twitter.com/1AxtaY7o1N— Indian Clicks (@IndianClicks) August 11, 2026 -
మల్లన్న ‘పట్నం’లో కమీషన్ల కట్నం
సాక్షి, హైదరాబాద్: దేవుడి ఆదాయంపై ప్రభావం చూపించే ఆ నిర్ణయాన్ని ఓ ఉన్నతాధికారి తిరస్కరించారు. కానీ ఆ అధికారి బదిలీ కాగానే మరో అధికారి దాని అమలుకు రంగం సిద్ధం చేశారు. దాని వెనుక రూ.కోటిన్నర కమీషన్‌కు బేరం కుదిరిందని, ఇందుకు ఓ దళారీ చక్రం తిప్పాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ దళారీ ఓ ఉన్నతాధికారి కోటరీ మనిషని తెలుస్తోంది. ప్రధాన పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఈ అవినీతి తంతు జరుగుతోంది. ఆలయం పరిధిలో అధికారికంగా నమోదైన 163 మంది ఒగ్గు పూజారులకు అదనంగా మరో 55 మందిని నియమించుకునేందుకు వీలుగా ఫైల్ కదిలి కమిటీ ఏర్పాటు కాగా..ఇందుకు గాను ఒక్కో ఒగ్గు పూజారి రూ.3 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆరు నెలల కిందే వద్దన్నా.. ఈ అవినీతి దందాకు గత జనవరిలోనే తెరలేచింది. అయితే అప్పట్లో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి వారి నియామకానికి అడ్డు చెప్పారు. ప్రస్తుత భక్తుల రద్దీకి చాలినంత మంది ఒగ్గు పూజారులు ఉన్నందున కొత్తవారి నియామకం అవసరం లేదని, వారిని నియమిస్తే దేవుడి ఖజానాకు రావాల్సిన టికెట్ ఆదాయంలో సగం వారి వాటాగా మళ్లి నష్టం వాటిల్లుతుందని చెప్పారు. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా నాటి దేవాలయ కార్యనిర్వహణాధికారిని ఆదేశించగా, ఆయన కూడా ఇదే అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా సమర్పించారు. దీంతో ఈ ప్రతిపాదనను దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం తిరస్కరించింది. అయితే ఇటీవల అడ్డు చెప్పిన ఆ ఉన్నతాధికారి బదిలీ కావటంతో ఆయన స్థానంలోకి వచ్చిన మరో అధికారి పాత ప్రతిపాదనను తిరగదోడటంతో ఫైలు చకచకా కదిలిందనే చర్చ జరుగుతోంది. చక్రం తిప్పిన దళారీ.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారి కోటరీ మనిషి అయిన రిటైర్డ్ ఉద్యోగి ఒకరు 55 మంది ప్రతిపాదిత ఒగ్గు పూజారి అభ్యర్థులతో కమీషన్ బేరాలు కుదిర్చినట్టు తెలుస్తోంది. వారికి అధికారిక గుర్తింపు ఇచ్చేలా మమ అనిపించేందుకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, రీజినల్ జాయింట్ కమిషనర్, వరంగల్ డిప్యూటీ కమిషనర్, దేవాలయ కార్యనిర్వహణాధికారి, మెదక్ సహాయ కమిషనర్, ఒగ్గు పూజారుల సంఘం అధ్యక్షుడితో కమిటీ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఒగ్గు పూజారులు నేరుగా దేవాదాయ శాఖ నియమించే అర్చకులు కాదు. ఆ దేవాలయ జాబితాలో అధికారికంగా పేరు నమోదు చేసుకుంటే.. ప్రధాన దేవాలయం వెలుపల భక్తులు నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవ పట్నాలు జరిపించేందుకు వీలవుతుంది. ఏమిటీ పట్నాలు..? మరే దేవాలయంలో లేని పట్నాల సంప్రదాయం ఇక్కడుంది. పూజల్లో భాగంగా వేసే ప్రత్యేక తరహా ముగ్గునే ‘పట్నం’గా పేర్కొంటారు. ముఖ మండపం వద్ద నిర్వహించేదాన్ని ముఖ మండప పట్నమని, అక్కడి పవిత్ర గంగరేవి చెట్టు వద్ద వేసే పట్నాన్ని నజర్ పట్నమని, భక్తులు ఉండే ఆవాసాల వద్ద వేసే పట్నాన్ని చిలుక పట్నమని పిలుస్తారు. వీటి కోసం భక్తులు ఆలయానికి రుసుము చెల్లించి రశీదు పొందాలి. అలా రుసుముల రూపంలో వచ్చిన ఆదాయంలో 50 శాతాన్ని ఈ ఒగ్గు పూజారులకు ఆలయం చెల్లిస్తుంది. ఆదాయంలో సింహభాగం పూజారులకే.. దేవాలయ నిర్వహణకు వాడాల్సిన ఖజానా ఆదాయంలో సింహభాగం, ఒగ్గు పూజారులకే వెళుతుందన్న మాట. అలా ప్రస్తుతం టికెట్ల రూపంలో ఏటా వచ్చే దాదాపు రూ.4 కోట్ల ఆదాయంలో సగం వారికే చేరుతోంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. పూజారులకు వెళ్లే మొత్తం కూడా పెరుగుతుంది. అయితే ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన..’అన్న చందాన పూజారుల సంఖ్య పెరిగేకొద్దీ ప్రస్తుతం ఉన్న పూజారులకు ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పటికే తమ ఆదాయం సరిపోవటం లేదని, తమకు చెల్లిస్తున్న వాటాను 50 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని గతంలో పూజారులు డిమాండ్ చేశారు. కానీ దేవాదాయ శాఖ తిరస్కరించింది. ఇప్పుడు పూజారుల సంఖ్య మరింత పెరిగితే ఆ ప్రతిపాదనకు అంగీకరించాల్సిన పరిస్థితి ఉంటుందని, అప్పుడు ఆలయ ఆదాయం భారీగా తగ్గిపోతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వాస్తవానికి కేవలం నాలుగైదు నెలలు మాత్రమే వీరికి పని ఉంటుంది. ఇప్పుడు పూజారుల పెంపు అవసరం లేనప్పటికీ కమీషన్లు దండుకునేందుకే నియామకాలకు తెరతీశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
కొమురవెల్లి : అగ్నిగుండంపై ఉత్సవ విగ్రహాలతో పూజారులు (ఫొటోలు)
-
సిద్దిపేట : కమనీయం కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)
-
కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం,అగ్నిగుండాలు తరించిన భక్తకోటి (ఫొటోలు)
-
Telangana Temple Photos: ఈ ప్రముఖ దేవాలయాలు మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
Komuravelli : వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)
-
కొమురవెల్లిలో ముక్కు అవినాష్
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబసమేతంగా స్వామి వారికి పట్నం వేసిన అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలావుంటే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పలువురు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చదవండి: వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు -
‘తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర’
-
మల్లన్న సన్నిధిలో మహా కుంభాభిషేకం
సాక్షి, సిద్దిపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో శుక్రవారం రాజగోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో ఉజ్జయినితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు పాల్గొన్నారు. చివరి రోజు శుక్రవారం ఆలయ గోపురంపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరు గోపురంపై అభిషేకం నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హరీష్
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్నను మంత్రి హరీశ్ రావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో నిర్వహించదలిచిన పలు అభివృద్ధి పనులకు హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న హుండీ లెక్కింపులో చేతివాటం
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం బయటపడింది. లెక్కింపు జరగుతున్న సమయంలో అందులో పాల్గొన్న ఓ మహిళా చేతివాటం చూపించింది. లెక్కింపు చేస్తున్న క్రమంలో ఎవరి కంటాపడకుండా కొంత బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లడానికి యత్నించింది. ఆలయ ముఖమండపంలో హుండీ లెక్కింపులు నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న ఖాత శాంతమ్మ 5.77 గ్రాముల బంగారు, 5.29 గ్రాముల వెండి ఆభరణాలను తీసుకెళ్తుండంతో మండపం వద్ద తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఆమెను పోలీసులకు అప్పగించారు. -
'కొమురవెల్లి'లో కోడెల వేలం నిలిపివేయండి
- మల్లన్న ఆలయ అధికారులకు కలెక్టర్ ఆదేశం - సాక్షి కథనంతో కదలిక కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో కోడెల వేలాన్ని నిలిపి వేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆల యాధికారులను ఆదేశించారు. ఆలయానికి ఇచ్చిన కోడెలను కబేళాకు అమ్ముకుంటున్న తీరుపై ‘మల్లన్నా.. ఇదేం ఘోరం’ అన్న శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. బుధవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన.. కోడెల అమ్మకంపై విచారణ చేపట్టారు. అనంతరం విలేక రులతో మాట్లాడారు. ఇక నుంచి క్రయవిక్రయాలు చేపట్ట వద్దని ఈవోను ఆదేశించారు. కొమురవెల్లిలో గోశాలను అభి వృద్ధి చేసి గోవులు, కోడెల సంరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయి లో నిర్వహించాలన్నారు. ప్రతి మూడు, 4 నెలలకు ఒకసారి సమీక్షించి ప్రత్యే క చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: ఘోరం మల్లన్నా.. ఘోరం!) వీహెచ్‌పీ ధర్నా: కొమురవెల్లి మల్లన్నకు భక్తులు భక్తితో ఇచ్చే కోడెలను వేలంతో కబేళాలకు తరలింపును నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించింది. ఈ మేరకు ఆలయ ఈఓ రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేసింది. అనంతరం వీహెచ్‌పీ జిల్లా నాయకుడు వీరబత్తిని సత్యనారాయణ మాట్లాడుతూ గోవులను కబేళాకు తరలింపుతో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆలయ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేపట్టాలని కోరారు. -
ఘోరం మల్లన్నా.. ఘోరం!
కబేళాలకు తరలుతున్న కొమురవెల్లి మల్లన్న కోడెలు - వేలం నిర్వహించి కబేళా ఏజెంట్లకు అమ్మేస్తున్న ఆలయ అధికారులు - రెండు మూడు నెలలకోసారి విక్రయం - సిండికేట్‌గా మారి కొంటున్న బేరగాళ్లు - అక్కడ్నుంచి లారీల ద్వారా హైదరాబాద్‌లోని కబేళాలకు తరలింపు - భక్తితో సమర్పించిన కోడెల్ని కోతకు పంపడంపై భక్తుల ఆగ్రహావేశాలు (వర్దెల్లి వెంకటేశ్వర్లు) కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. భక్త జనుల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్నకు కోడె కడితే కోరుకున్న కొడుకు పుడతాడట! కొండరాళ్ల నడుమ పుట్ట మన్నుతో రూపం పోసుకున్న ఆ మల్లికార్జునుడికి తిరుగుడు కోడెను ఇస్తే కోరిన కోరిక తీరుతుందట!! ఈ విశ్వాసంతో భక్తులు మొక్కుబడి కింద కోడెలు, దూడలను మల్లన్నకు సమర్పించుకుంటారు. కానీ ఆ భక్త వత్సలుడి మూగజీవాలు కబేళాలకు తరలిపోతున్నాయి. పశు పోషణ భారం నుంచి తప్పించుకునేందుకు ఆలయ అధికారులే వాటిని కబేళాల ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. నెలనెలా పదుల సంఖ్యలో వస్తున్న పశువులను ఎప్పటికప్పుడు వేలం వేసి వారికి ఇచ్చేస్తున్నారు. ఓ అజ్ఞాత భక్తుడు ‘సాక్షి’కి చేరవేసిన సమాచారంతో కూపీ లాగగా... మల్లన్న లేగదూడలు గత కొన్నేళ్లుగా కోతకు, కబేళాలకు తరలిపోతున్నట్లు తేలింది. రెండు మూడు నెలలకోసారి వేలం సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొలువైన మల్లన్నకు లేగ దూడలు, కోడెలు అంటే చాలా ఇష్టం. సంతానం లేని దంపతులు, దారిద్య్రంతో బాధపడుతున్న భక్తులు కోనేటిలో తడిబట్ట స్నానం చేసి ఆలయం ముందు ఒళ్లు బండ వద్ద మల్లన్న దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. కోరుకున్న కోరిక తీరగానే మల్లన్నకు ఇష్టమైన కోడెలను కట్టి మొక్కు తీర్చుకుంటారు. ఇలా ప్రతినెలా పదుల సంఖ్యలో కోడెలు, దూడలను భక్తులు స్వామివారికి మొక్కులుగా చెల్లిస్తున్నారు. ఈ మూగజీవాలను పోషించడం వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం అన్న కారణంతో ఆలయ అధికారులు ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి వేలం పాటలు నిర్వహించి వాటిని విక్రయిస్తున్నారు. మూడేళ్లుగా కోతకే.. గడిచిన మూడేళ్లుగా ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెల వివరాల నివేదికలను, ఆలయ అధికారులు వేలం వేసిన రికార్డులను ‘సాక్షి’పరిశీలించింది. 2014లో ఐదుసార్లు, 2015లో ఆరుసార్లు, 2016 ఐదు పర్యాయాల చొప్పున పశువులను వేలం వేసినట్టు రికార్డుల్లో ఉంది. అన్నిసార్లు జరిగిన వేలం పాటల్లోనూ కేవలం ఆరు నుంచి ఏడుగురే పాల్గొని పశువులు దక్కించుకున్నట్టు తేలింది. చిరునామాల ఆధారంగా ‘సాక్షి’వారి వివరాలను సేకరించింది. చేర్యాల మండలం నర్సాయపల్లి, వేచరేణి గ్రామాలకు చెందిన ముగ్గురు సభ్యుల చొప్పున ఉన్న రెండు సిండికేటు బేరగాళ్లను గుర్తించి వారితో మాట్లాడింది. దీనిపై వారిని కదిలించగా.. ‘‘వేలం పాటలు వేసే ముందు దేవాలయం అధికారుల నుంచి మాకు ఫోన్ వస్తుంది. వేలంలో పశువులు తీసుకుంటాం. వాటిని ఎక్కువ రోజులు మా దగ్గర ఉంచుకోం. కొంత లాభం చూసుకొని అమ్ముకుంటాం. పశువులు కోతకు పోతాయి. చేర్యాల, సిద్దిపేట అంగడికి తీసుకపోతాం. అక్కడికి హైదరాబాద్ ఏజెంట్లు వచ్చి లారీల్లో తీసుకుపోతారు’’అని చెప్పారు. బాబుమియానే సాక్ష్యం... కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన ఓ బేరగాడు రూ.3,400, రూ.2,400, రూ.3,200, రూ.2,700, రూ.3,900, రూ.3,800, రూ.16,200 చొప్పున 7 కోడెలను వేలం పాటలో కొనుగోలు చేశాడు. పశువుల వ్యాపారం చేసే ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘బతకడానికి ఏదో పనిచేసుకోవాలే కదా. కొమురవెల్లి దేవుడికి మొక్కులు తీర్చేటోళ్లు అప్పగించే లేగలు, దూడలను వేలం పాటలో కొంటా.. కమీషన్ మీద కబేళాకు విక్రయిస్తా.. వాటిపై వచ్చే కొద్దిపాటి పైసలతో ఇళ్లు గడుస్తుంది. కొమురవెల్లి దేవస్థానం నుంచి బాగా తెలిసినోళ్లు వేలంపాట అప్పుడు నాకు ఫోన్ చేస్తరు. వెంటనే పోయి పాటలో పాల్గొని అన్నింటినీ కొనుక్కుంటా. ఒక్కొక్కసారి తక్‌పట్టీలు(రశీదులు) ఇత్తరు.. ఒక్కోసారి ఇయ్యరు..’’అని ఆయన చెప్పాడు. దేవాలయం నుంచి కబేళా దాకా.. ఈ ఏడాది నవంబర్ 25న ఆలయ అధికారులు పశువుల వేలం నిర్వహించారు. ఇద్దరు సిండికేటు బేరగాళ్లు రూ.6,300, రూ.6,000, రూ.1,400, రూ.3,600, రూ.19,000, రూ.7,000, రూ.5,000 చొప్పున ఏడు కోడెలను కొనుగోలు చేశారు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన ఫొటో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆ కోడెలను వాళ్లు డిసెంబర్ 2న నేరుగా హుస్నాబాద్ అంగడికి తోలుకెళ్లారు. అంగట్లో కబేళా ఏజెంట్లకు విక్రయించారు. వారు అక్కడ్నుంచి వాటిని లారీలో కుక్కి హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. అంతకుముందు జరిగిన వేలం పాటలో (సెప్టెంబర్ 3న) చేర్యాలకు చెందిన మరో వ్యక్తి రూ.5 వేల చొప్పున రెండు, రూ.23,000, రూ.1,800, రూ.1,000 చొప్పున మొత్తం ఐదు కోడెలను కొనుగోలు చేశారు. వాటిని ఆయన వారానికి ఒకటి చొప్పున కోత కోసి మాంసం విక్రయిస్తున్నాడు. ఎంతో భక్తిశ్రద్ధలతో మల్లన్నకు మొక్కుగా చెల్లించిన కోడెలను కబేళాలకు తరలించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవే పశువులను హుస్నాబాద్ అంగడి నుంచి లారీలో తీసుకుపోతున్న కబేళా ఏజెంట్లు


