మల్లన్న సన్నిధిలో మహా కుంభాభిషేకం

Harish Rao Attends Maha Kumbhabhishekam In Komuravelli Mallanna Temple - Sakshi

రాజగోపురంపై పూజలు చేసిన మంత్రులు హరీశ్, తలసాని

సాక్షి, సిద్దిపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో శుక్రవారం రాజగోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో ఉజ్జయినితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు పాల్గొన్నారు. చివరి రోజు శుక్రవారం ఆలయ గోపురంపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరు గోపురంపై అభిషేకం నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని  తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top