థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా | Bhool Chuk Maaf Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

OTT Movie: 2 వారాలకే ఓటీటీలోకి వస్తున్న లేటెస్ట్ మూవీ

Jun 3 2025 5:17 PM | Updated on Jun 3 2025 6:05 PM

Bhool Chuk Maaf Movie OTT Streaming Details

ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. వీళ్లు చెప్పిందే రాజ్యం అన్నట్లు నడుస్తోంది. కొత్త మూవీస్ ఎప్పుడు రిలీజ్ కావాలి? ఎప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావాలనేది సదరు సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ సినిమా విషయంలో అలానే జరిగినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఉండగానే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేస్తున్నారట. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులోకి రానుంది?

రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా 'భోల్ చుక్ మాఫ్'. లెక్క ప్రకారం ఈ మూవీ గత నెల తొలి వారంలో రిలీజ్ కావాల్సింది. కానీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని సడన్‌గా ప్రకటించారు. దీంతో ప్రముఖ మల్టీప్లెక్ సంస్థ.. కోర్టుని ఆశ్రయించింది. రూ.60 కోట్ల మేర దావా వేసింది. దీంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. అలానే మే 23న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: కురచ దుస్తులపై కామెంట్స్‌.. సురేఖావాణి ఏమందంటే?)

విడుదలై రెండు వారాలు కూడా కాలేదు. అప్పుడే 'భోల్ చుక్ మాఫ్' సినిమాని అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. జూన్ 6 నుంచి అంటే ఈ వీకెండ్‌లో సినిమా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే గనక థియేటర్లలో ఉండగానే సినిమా.. డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేస్తున్నట్లే.

భోల్ చుక్ మాఫ్ విషయానికొస్తే.. వారణాసిలో ఉండే రంజన్(రాజ్ కుమార్ రావ్).. టిట్లీ(వామికా గబ్బీ)ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ శివుడికి ఇచ్చి మొక్కుని మరిచిపోతాడు. దీంతో టైమ్ లూప్‌లో చిక్కుకుని, పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకే మళ్లీ మళ్లీ వస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడే ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. కామెడీని ఎంజాయ్ చేసే వాళ్లకు ఇదో టైమ్ పాస్ మూవీ అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement