కురచ దుస్తులపై కామెంట్స్‌.. సురేఖావాణి ఏమందంటే? | Surekha Vani About Negative Comments On Their Dressing | Sakshi
Sakshi News home page

Surekha Vani: పొట్టి బట్టలపై కామెంట్స్‌.. సురేఖావాణి రియాక్షన్‌ ఇదే!

Jun 3 2025 4:55 PM | Updated on Jun 3 2025 5:39 PM

Surekha Vani About Negative Comments On Their Dressing

బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ చౌదరి (Amardeep Chowdary) వెండితెరపై తన సత్తా చూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అతడి చేతిలో మూడు సినిమాలదాకా ఉన్నాయి. అందులో ఒకటి చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి (Chowdary Gari Abbayi tho naidu Gari Ammayi Movie). సీనియర్‌ నటి సురేఖావాణి కూతురు సుప్రీత కథానాయికగా నటిస్తోంది. సోమవారం ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

డ్రెస్సింగ్‌పై నెగెటివ్‌ కామెంట్స్‌
ఈ ఈవెంట్‌కు సురేఖావాణి (Surekha Vani) హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు పొట్టి బట్టలపై వచ్చే కామెంట్ల గురించి ప్రశ్న ఎదురైంది. సినిమాలో పని చేసే ఆర్టిస్టులు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా సోషల్‌ మీడియాలో ఫోటోలు పెడుతుంటారు. వాటిని చూసే జనాలు.. ఆడపిల్ల అయి ఉండి ఇలాంటి దుస్తులు వేసుకుంటారా? అని నెగెటివ్‌గా కామెంట్లు చేస్తుంటారు. మీ జీవితంలో మీరెలా ఉండాలని సలహా ఇచ్చేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది.

నవ్వుకునేవాళ్లం
దానికి సురేఖావాణి స్పందిస్తూ.. అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించలేవు కదా.. వాడేదో ఆలోచించుకుని, ఏదో అనుకుని ఇష్టమొచ్చినట్లు కామెంట్స్‌ చేస్తాడు. వాటిని ఎంతవరకు తీసుకోవాలన్నది మనకు తెలిసుండాలి. మొదట్లో నేను, నా కూతురు ఆ కామెంట్లు చదువుకుని రియాక్ట్‌ అయ్యేవాళ్లం. తర్వాత దాన్ని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకోవడమే మానేశాం అని చెప్పుకొచ్చింది.

చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్‌తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement