రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్‌తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్‌ | Anju Aravind Opens Up About Her Relations, Divorce And Her Present Relationship With Her First Crush | Sakshi
Sakshi News home page

Anju Aravind: మొదటి భర్తకు విడాకులు, రెండో భర్త మరణం.. ఐదేళ్లుగా అతడితోనే కలిసి..

Jun 3 2025 12:34 PM | Updated on Jun 3 2025 1:53 PM

Anju Aravind opens up About Her Relations, She Living with her First Crush

అంజు అరవింద్‌ (Anju Aravind).. నటి మాత్రమే కాదు డ్యాన్సర్‌ కూడా! అప్పట్లో మలయాళ సినిమాల్లో టాప్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె కన్నడ, తమిళ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. తెలుగులో రథయాత్ర అనే ఏకైక సినిమాలో నటించింది. అరుణాచలం సినిమాలో రజనీకాంత్‌ సోదరిగానూ కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను గురించి వెల్లడించింది.

రెండు పెళ్లిళ్లు విషాదాంతం..
అంజు అరవింద్‌ మాట్లాడుతూ.. మొదటి పెళ్లి విడాకులతో ముగిసిపోయింది. రెండో పెళ్లి చేసుకున్నాక భర్త మరణించాడు. ఇప్పుడు నేను నా చిన్ననాటి క్రష్‌తో కలిసి జీవిస్తున్నాను. సంజయ్‌ అంబలపరంబత్‌తో ఐదేళ్లుగా కలిసుంటున్నాను. నన్ను డ్యాన్స్‌ టీచర్‌గా నిలబెట్టి, బెంగళూరులో సెటిలవడానికి సాయం చేసింది సంజయే.. చిన్నప్పుడు ఒక డ్యాన్స్‌ స్కూల్‌లో కలుసుకున్నాం. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. అప్పుడతడే నా ఫస్ట్‌ క్రష్‌. 

మా ప్రేమకథతో సినిమా తీయొచ్చు
డ్యాన్స్‌ స్కూల్‌ అయిపోయాక మా జీవితాలు వేరయ్యాయి. చివరకు ఇలా విచిత్రంగా కలుసుకుని ఒక్కటయ్యాం.. మా కథ చెప్పాలంటే ఓ సినిమానే తీయొచ్చు అని చెప్పుకొచ్చింది. డ్యాన్సర్‌ అయిన సంజయ్‌ మొదట్లో ఐటీ నిపుణుడిగా పని చేశాడు. ప్రేయసి కోసం బెంగళూరులో అంజు అరవింద్‌ అకాడమీ ఆఫ్‌ డ్యాన్స్‌ సంస్థను నెలకొల్పాడు. మలయాళంలో బోలెడన్ని సినిమాలు చేసిన అంజు అరవింద్‌.. తర్వాతి కాలంలో బుల్లితెరపైనా సందడి చేసింది. పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. 

చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. ట్రీట్‌మెంట్‌ పనిచేయక నటుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement