
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ 'జిగేల్'. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సాంగ్స్ హిట్టయ్యాయి.
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మార్చి 7న సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాస్యనటులంతా ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న 'జిగేల్' మాస్, క్లాస్ ఆడియన్స్ అంతా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేస్తారని నిర్మాతలు తెలిపారు. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకు పని చేశారు. ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.
చదవండి: రష్మికపైనే విమర్శలా? ఆమె ట్రాక్ రికార్డ్ చూశారా?: ఛావా నటి