‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ పాటకు మిలియన్‌ వ్యూస్‌ | Mr Work From Home Movie: Vennele Vennele Naalo Songs Bags Fabulous Response | Sakshi
Sakshi News home page

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ పాటకు మిలియన్‌ వ్యూస్‌

Published Wed, Jun 8 2022 5:27 PM | Last Updated on Wed, Jun 8 2022 5:27 PM

Mr Work From Home Movie: Vennele Vennele Naalo Songs Bags Fabulous Response - Sakshi

త్రిగున్-పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’. లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుదీప్ సీహెచ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ  సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్.ఎమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే’పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది.ఒకే ఒక లోకం నువ్వే..." పాటతో సంచలనం సృష్టించిన అరుణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి.కారుణ్య ఆలపించారు. ఇప్పటికే ఈ పాట మిలియన్‌ వ్యూస్‌ని సాధించింది.

హీరో త్రిగున్‌ పుట్టిన రోజు(జూన్‌ 8) సందర్భంగా ఈ చిత్రం నుంచి మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. తనికెళ్ల భరణి వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ మోషన్‌ పోస్టర్‌ అందరిని ఆకట్టుకుంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు.అనీష్ కురువిల్లా, సత్యకృష్ణన్, సి.వి.ఎల్.నరసింహారావు, జయశ్రీ రాచకొండ, వివా హర్ష, గుండు సుదర్శన్, నెల్లూరు సుదర్శన్, గిరిధర్, జబర్దస్త్ వేణు తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అరుణ్‌ చిలువేరు సంగీతం అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement