
నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా తెలుగు వర్షన్ సాంగ్స్ అన్ని ఒకే వీడియోతో షేర్ చేశారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.
విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా థగ్ లైఫ్ నిలుస్తుందని దర్శకుడు మణిరత్నం అన్నారు. ప్రస్తుతం విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే, టాప్ సింగర్ చిన్మయి ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్‌ను పాడారు. ట్రాక్ మూడో వరుసలో ఉన్న 'ముద్దు వాన' సాంగ్‌ను ఆమె పాడారు. సింగర్ మంగ్లీ కూడా ఈ చిత్రంలో సూపర్ హిట్ పాటను ఆలపించారు. థగ్ లైఫ్ పాటల ప్రారంభంలోనే 'జింగుచ్చా' అంటూ ఆమె దుమ్మురేపారు. ఈ సినిమా కోసం ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాస్ కుమారుడు విజయ్ ఒక పాట, ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ ఒక పాటతో మెప్పించారు.