
నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) మరోసారి దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇవ్వనున్నాడు. 2023లో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మరోసారి వారిద్దరూ కలిసి ఒక భారీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా డాకు మహారాజ్‌తో విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే, మాస్ సినిమాలకు తనదైన మార్క్ చూపించే బాలయ్య మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్నాడు. దీంతో బాలకృష్ణతో మరో యాక్షన్ మూవీనిప్లాన్ చేశారట గోపీచంద్.
ఇటీవల బాలకృష్ణకు గోపీచంద్ ఓ కథ చెప్పగా, ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లోని సినిమా అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది సెప్టెంబరు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లోని సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని ఊహించవచ్చు. ఈ సినిమాను కేవీఎన్ ప్రోడక్షన్స్ లేదా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.